గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) అదరగొట్టింది. సోమవారం ఎస్సీ ఈస్ట్బెంగాల్తో జరిగిన మ్యాచ్‌లో హెచ్ఎఫ్సీ 4-0 తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ తరఫున స్టార్ స్ట్రైకర్ ఓగ్బాచె(21ని, 44ని, 74ని) హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగగా, అనికేత్ జాదవ్(45ని) మరో గోల్ చేశాడు. ఈ విజయం ద్వారా 20 పాయింట్లతో హెచ్ఎఫ్సీ మళ్లీ నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించగా, మరో ఓటమిని ఖాతాలో వేసుకున్న ఈస్ట్‌బెంగాల్ (9) చివరి స్థానంలో ఉంది.