ODI World Cup 2023 | సంచలనాలేమీ లేవు.. కివీస్ భారీ విజయం..
ODI World Cup 2023 | గత మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి అనూహ్య విజయాన్ని అందుకున్న అఫ్గానిస్తాన్ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయింది. న్యూజిలాండ్‌తో చెన్నై వేదికగా బుధవారం ముగిసిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది.
ODI World Cup 2023 | గత మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి అనూహ్య విజయాన్ని అందుకున్న అఫ్గానిస్తాన్ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయింది. న్యూజిలాండ్‌తో చెన్నై వేదికగా బుధవారం ముగిసిన మ్యాచ్‌లో కివీస్ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గానిస్తాన్.. 139 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా కివీస్.. 149 పరుగుల భారీ తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన అఫ్గాన్ బ్యాటర్లు నేటిమ్యాచ్లో మాత్రం తేలిపోయారు. కివీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ అఫ్గానిస్తాన్ బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చారు. ఈ మెగా టోర్నీలో కివీస్‌కు ఇది నాలుగో విజయం కాగా అఫ్గాన్‌కు మూడో ఓటమి.
భారీ లక్ష్య ఛేదనలో అఫ్గాన్ బ్యాటర్లు కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేదు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే తొలి వికెట్‌ను కోల్పోయిన అఫ్గానిస్తాన్.. క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మత్ షా ఒక్కడే 36 పరుగులతో టాప్ స్కోరర్ కాగా మిగిలినవారిలో ఒక్కరు కూడా క్రీజులో నిలువలేకపోయారు.
తొలుత ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్ (11)ను మాథ్యూ హెన్రీ ఐదో ఓవర్లో క్లీన్ బౌల్డ్ చేయగా.. మరుసటి ఓవర్లోనే బౌల్డ్.. ఇబ్రహీం జద్రాన్ (14)ను పెవిలియన్‌కు పంపాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (8) కూడా విఫలమయ్యాడు. రెహ్మాత్ షా తో కలిసి అజ్మతుల్లా ఒమర్జాయ్ (27) కొద్దిసేపు క్రీజులో నిలిచాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. కానీ బౌల్ట్ మరోసారి కివీస్‌ను దెబ్బకొట్టాడు. అజ్మతుల్లాను ఔట్ చేయడంతో అఫ్గాన్ కథ మొదటికొచ్చింది. అతడి తర్వాత వచ్చిన ఇక్రాం అలిఖిల్ (19 నాటౌట్) మినహా ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లెవరూ డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయలేకపోయారు. అజ్మతుల్లా నిష్క్రమించిన కొద్దిసేపటికే రెహ్మత్ షాతో పాటు అఫ్గాన్ లోయరార్డర్ చాపచుట్టేసింది. ఫలితంగా అఫ్గాన్‌కు భారీ ఓటమి తప్పలేదు.
కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్, లాకీ ఫెర్గూసన్‌లు తలా మూడు వికెట్లు తీయగా ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టాడు. హెన్రీ, రచిన్ రవీంద్రలకు తలా ఓ వికెట్ దక్కింది.ఈ విజయంతో న్యూజిలాండ్ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్ టాప్-4లో ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

