Suzie Bates | నా ఆఖరి మిషన్ అదే.. త్వరలోనే క్రికెట్‌ను వదిలేస్తా..!
Suzie Bates : న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ సుజీ బేట్స్ (Suzie Bates) కీలక నిర్ణయం తీసుకుంది. రెండు దశాబ్దాలకు పైగా వైట్ ఫెర్న్స్ జట్టు విజయాల్లో కీలకమవుతున్న ఈ సీనియర్ ఆల్‌రౌండర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనుంది.
Suzie Bates : న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ సుజీ బేట్స్ (Suzie Bates) కీలక నిర్ణయం తీసుకుంది. రెండు దశాబ్దాలకు పైగా వైట్ ఫెర్న్స్ జట్టు విజయాల్లో కీలకమవుతున్న ఈ సీనియర్ ఆల్‌రౌండర్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనుంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ విజేతగా క్రికెట్‌కు అల్విదా చెబుతానని వెల్లడించిందీ సీనియర్ ప్లేయర్. బ్రిటన్‌లో జరుగబోయే పొట్టి ప్రపంచకప్ నాకు ఆఖరు. ఈ టోర్నీలో ఛాంపియన్‌గా ఆటకు రిటైర్మెంట్ చెప్పేస్తాను అని బేట్స్ తెలిపింది.
మహిళా క్రికెట్లో సీనియర్ ప్లేయర్ సుజీ బేట్స్ అంతర్జాతీయ క్రికెట్‌ను వీడేందుకు సిద్ధమైంది. వచ్చే పొట్టి ప్రపంచకప్ ఆడేసి ఆటకు గుడ్ బై చెప్పాలని బేట్స్ నిర్ణయించుకుంది. ‘ఇరవై ఏళ్ల కెరీర్‌ను చూసుకుంటే.. కాలం ఎంత త్వరగా పరుగులు తీసిందో నమ్మలేకపోతున్నా. వైట్ ఫెర్న్స్ తరఫున ఎన్నో విజయాలు సాధించడం చాలా గర్వంగా ఉంది. ప్రతిరోజు గొప్ప వ్యక్తిగా, జట్టు సభ్యురాలిగా, అథ్లెట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తాను అని బేట్స్ వెల్లడించింది. నా ఆఖరి మిషన్ ఒకటుంది.
“I have one final mission: to head to the UK and win another World Cup”
Suzie Bates, who debuted in 2006, will retire from international cricket at the conclusion of the upcoming T20 World Cup https://t.co/kAi3XLTJZ6 pic.twitter.com/rU80dK7lkQ
— ESPNcricinfo (@ESPNcricinfo) April 24, 2026
నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు మిగిల్చిన బ్రిటన్‌కు వెళ్లి.. అక్కడ మరొక వరల్డ్‌కప్ గెలవాలని అనుకుంటున్నా. చివరిసారిగా జట్టు కోసం నా సర్వశక్తులు ఒడ్డుతాను. నాకు మద్దతుగా నిలిచిన కుటుంబసభ్యులు, స్నేహితులు అందరికీ కృతజ్ఞతలు. ఈ ప్రయాణంలో ఎదరైన ఒడిదొడుకుల్లో తోడుగా ఉన్న నా భర్త స్కాటీ, నా కుమారులకు కృతజ్ఞతలు. నాకు ఇన్ని అవకాశాలు కల్పించిన కోచ్‌లకు ధన్యవాదాలు’ అని బేట్స్ పేర్కొంది.
2006లో అంతర్జాతీయ మ్యాచ్
దేశవాళీ క్రికెట్లో పదిహేనేళ్లకు అరంగేట్రం చేసిన బేట్స్ 2006లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. మహిళల టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డు నెలకొల్పిన ఈ సీనియర్ ఆల్‌రౌండర్ వన్డేల్లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 2011లో కివీస్ సారథిగా ఎంపికైన బేట్స్ ఏడేళ్లు జట్టును గొప్పగా నడిపింది. క్రికెటర్‌గా, కెప్టెన్‌గా రాణించిన ఆమెను విజ్డెన్ 2016లో ప్రపంచంలో అగ్రగామి మహిళా క్రికెట్‌గా గుర్తించింది.
Suzie Bates’ illustrious career in frames ⌛️🤩
More 📲 https://t.co/99Hr0GXBgA pic.twitter.com/D8MnKT8pnk
— ICC (@ICC) April 24, 2026
ఇటీవలే తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న బేట్స్ వరల్డ్‌కప్ స్క్వాడ్‌కు ఎంపికైంది. మే నెల మొదటి వారంలో న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లో ఆడనుంది. క్రికెట్‌తో పాటు బాస్కెట్ బాల్ ఆటలోనూ బేట్స్‌కు ప్రావీణ్యం ఉంది. 2008లో ఆమె బీజింగ్ ఒలింపిక్స్‌లో సైతం పాల్గొంది. జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా మహిళల పొట్టి ప్రపంచకప్ షురూ కానుంది. మరుసటి రోజే వెస్టిండీస్‌తో న్యూజిలాండ్ తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

