మహమ్మద్ షమి మానవత్వం
భారత పేసర్ మహ్మద్ షమి మైదానంలో భారత జట్టును ఆదుకున్నట్టే మైదానం వెలుపల కూడా హీరోనని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం విరామంలో ఉన్న షమి ఆదివారం నైనిటాల్ జిల్లాలో ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించి మానవత్వం చాటుకున్నాడు.
నైనిటాల్: భారత పేసర్ మహ్మద్ షమి మైదానంలో భారత జట్టును ఆదుకున్నట్టే మైదానం వెలుపల కూడా హీరోనని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం విరామంలో ఉన్న షమి ఆదివారం నైనిటాల్ జిల్లాలో ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించి మానవత్వం చాటుకున్నాడు. తన ముందు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు రోడ్డుపైనుంచి పక్కనున్న లోయలోకి జారిపడింది. షమి వెంటనే తన కారును ఆపి ప్రమాదానికి గురైన కారులోని వ్యక్తిని వెంటనే వెలుపలికి తెచ్చి ప్రథమ చికిత్స అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను షమి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అప్లోడ్ చేసి ప్రమాదంలోని వ్యక్తిని రక్షించినందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు. షమి చర్యకు పలువురు సామాజిక మాధ్యమం వేదికగా ప్రశంసలు కురిపించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

