ముంబై ఇండియన్స్‌కు మరో షాక్. టాపార్డర్ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ (5) కూడా అవుటయ్యాడు. అంతకుముందు రెండో ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ (5) పెవిలియన్ చేరాడు. నాలుగో ఓవర్లో ఇషాన్ కిషన్ మూడు బౌండరీలు బాదాడు. నవదీప్ సైని వేసిన అదే ఓవర్ చివరి బంతికి అన్మోల్ప్రీత్ సింగ్ అవుటయ్యాడు. సైని వేసిన బంతిని లాఫ్ట్ చేసేందుకు అన్మోల్ ప్రయత్నించాడు.
కానీ బంతి అంత వేగంగా రాకపోవడంతో అతని అంచనా తప్పింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న పడిక్కల్ వేగంగా ముందుకు వచ్చి క్యాచ్ అందుకున్నాడు. దాంతో అన్మోల్ నిరాశగా వెనుతిరిగాడు. నాలుగు ఓవర్లు ముగిసే సరికి ముంబై జట్టు 40/2 స్కోరుతో నిలిచింది.