మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో రష్యా ప్లేయర్ మెద్వెదెవ్ మూడో రౌండ్‌కు చేరాడు. గురువారం జరిగిన రెండో రౌండ్లో మెద్వెదెవ్ 7-6 (7/1), 6-4, 4-6, 6-2తో ఆస్ట్రేలియా స్టార్ నిక్ కిర్గియోస్‌పై విజయం సాధించాడు. సుదీర్ఘ పోరులో 31 ఏస్‌లు కొట్టిన మెద్వెదెవ్ 4 బ్రేక్ పాయింట్లతో సత్తాచాటాడు. ఇతర మ్యాచ్‌ల్లో సిట్సిపాస్, రుబ్లేవ్, సిలిచ్ ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌లో సిమోనా హలెప్ 6-2, 6-0తో హడాడా మాలాపై గెలుపొందగా.. స్వియాటెక్, సబలెంక సునాయాస విజయాలతో తదుపరి రౌండ్‌కు చేరారు. యూఎస్ ఓపెన్ విజేత రెడుకాను ఓటమి పాలవగా.. ముగురుజా 3-6, 3-6తో కొర్నెట్ చేతిలో ఓడింది.