వర్షార్పణం.. భారత ఆశలపై వరుణుడు నీళ్లు

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు డ్రా
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి ముందంజ వేద్దామనుకున్న భారత ఆశలపై వరుణుడు నీళ్లు గుమ్మరించాడు. ఎడతెరిపి లేని వర్షంతో మైదానం మొత్తం తడిసి ముద్దయ్యింది. ఆటకు అనువుగా లేకుండా చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్క బంతి పడకుండానే ఆట డ్రాగా ముగియడంతో ఇరు జట్లకు చెరో నాలుగు పాయింట్లు కేటాయించారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యఛేదనలో ఆఖరి రోజు ఆదివారం ఆటకు వరుణుడు అడ్డంకిగా మారాడు. దాదా పు ప్రతిసారి ఇంగ్లండ్‌లో తొలి టెస్టును కోల్పోతూ వస్తున్నా.. భారత్ ఈ సారి చరిత్ర తిరుగరాద్దామనుకున్నా ఆశలు నెరవేరలేదు. ఈ సిరీస్ ద్వారా రాహుల్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా నిలదొక్కుకోగా, బుమ్రా మళ్లీ పాత ఫామ్ పుణికిపుచ్చుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టిన బుమ్రా తన పేస్‌కు పదును తగ్గలేదని నిరూపించాడు. జో రూట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్లు మధ్య గురువారం నుంచి లార్డ్స్ వేదికగా రెండో టెస్టు మొదలవనుంది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 183, భారత్ తొలి ఇన్నింగ్స్: 278, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 303, భారత్ రెండో ఇన్నింగ్స్: 52/1.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- cricket
- match draw
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

