Lionel Messi: హైదరాబాద్‌కు స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్.. డిసెంబర్ 13న రానున్న మెస్సి
Lionel Messi: ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సి.. హైదరాబాద్‌కు వస్తున్నాడు. డిసెంబర్ 13వ తేదీన అతను నగరంలో సందడి చేయనున్నాడు. లెజెండరీ ప్లేయర్ మెస్సీకి స్వాగతం పలికేందుకు సిటీ రెఢీ ఉందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
హైదరాబాద్: ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సి(Lionel Messi).. ఇండియాలో టూర్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఆ లెజెండరీ ప్లేయర్ ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని అతను కన్ఫర్మ్ చేశాడు. తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఈ విషయాన్ని చెప్పాడు. మరికొన్ని వారాల్లో గోట్ టూర్ ప్రారంభంకానున్నదని, భారత్ ప్రదర్శిస్తున్న ప్రేమ పట్ల థ్యాంక్స్ చెబుతున్నట్లు పేర్కొన్నారు. తన విజిట్‌లో హైదరాబాద్ నగరాన్ని కూడా జోడించారని, ఇది సంతోషకరమైన విషయం అన్నారు. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సి ఇండియాలోని కోల్‌కతా, ముంబై, ఢిల్లీ నగరాలతో పాటు హైదరాబాద్‌లోనూ టూర్ చేయనున్నారు.
డిసెంబర్ 13వ తేదీన హైదరాబాద్ నగరానికి మెస్సీ వస్తున్నాడు. ఆ రోజు రాత్రి 7.30కు కార్యక్రమం జరగనున్నది. మెస్సీ రాకను స్వాగతిస్తూ ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఫుట్‌బాల్ ప్రేమికులకు, హైదరాబాద్ నగరానికి ఇది సంతోషకరమైన విషయం అన్నారు. మెస్సీకి ఘన స్వాగతం పలికేందుకు నగరం సిద్ధంగా ఉందన్నారు.
I look forward to welcoming and hosting G.O.A.T. Lionel Messi in #Hyderabad on December 13. It is an exciting moment for our city and for every football fan who has dreamt of seeing a legend like you on our soil.
Hyderabad is ready to host him with warmth, pride and the spirit… pic.twitter.com/oBPRsb1uZf
— Revanth Reddy (@revanth_anumula) November 28, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

