Kylian Mbappe | ఆ క్లబ్‌తో సంతృప్తిగానే ఉన్నా.. వచ్చే సీజన్లో ఏమీ ఆశించట్లేదు : ఎంబాపే
Kylian Mbappe : ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపే(Kylian Mbappe) తన క్లబ్ కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. వచ్చే సీజన్లో పీఎస్జీ(పారిస్ సెయింట్ జర్మనీ) క్లబ్ నుంచి తాను ఏమీ ఆశించడం లేదని తెలిపాడు. 'నేను ఇక్కడ ఉన్నది ఆడడానికే. ఇంకా పీఎస్జీతో నా కాంట్రాక్ట్ ముగియలేదు...
Kylian Mbappe : ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపే(Kylian Mbappe) తన క్లబ్ కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. వచ్చే సీజన్లో పీఎస్జీ(పారిస్ సెయింట్ జర్మనీ) క్లబ్ నుంచి తాను ఏమీ ఆశించడం లేదని తెలిపాడు. ‘నేను ఇక్కడ ఉన్నది ఆడడానికే. ఇంకా పీఎస్జీతో నా కాంట్రాక్ట్ ముగియలేదు. ఇప్పటివరకైతే పీఎస్జీ చేయగలిగినంత చేస్తోంది. క్లబ్ పనితీరు పట్ల నేను చాలా సంతృప్తిగా ఉన్నా. ఇక మిగతావన్నీ నాకు సంబంధం లేని విషయాలు’ అని ఎంబాపే వెల్లడించాడు.
ఈ మధ్యే అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ(Lionel Messi), సెర్జియో రామోస్(Sergio Ramos) పీఎస్జీ క్లబ్‌ను వీడిన విషయం తెలిసిందే. దాంతో, ఎంబాపే కూడా వచ్చే సీజన్లో కొత్త క్లబ్‌కు మారతాడా? అనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ఎంబాపే తన లీగ్ కెరీర్‌పై స్పష్టత ఇచ్చాడు.
వరల్డ్ కప్ 2022 ఫైనల్లో ఎంబాపే, మెస్సీ

హ్యాట్రిక్ గోల్స్‌తో హల్చల్
గత ఏడాది ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అతను సంచలన ప్రదర్శన చేశాడు. హ్యాట్రిక్ గోల్స్ కొట్టి హల్చల్ చేశాడు. దాంతో, ఒక్కసారిగా మ్యాచ్ ఫ్రాన్స్ వైపు మలుపు తిరిగింది. కానీ షూటౌట్లో అర్జెంటీనా ఆటగాళ్లు అదరగొట్టారు. ఉత్కంఠ రేపిన షూటౌట్లో 4-2తో ఫ్రాన్స్ ఓటమిపాలైంది. టోర్నీ ఆసాంతం అద్భతంగా ఆడిన ఎంబాపే గోల్డెన్ బూట్ అవార్డు అందుకున్నాడు.ఫైనల్ విజయంతో లియోనల్ మెస్సీ తన వరల్డ్ కప్ కలను నిజం చేసుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burns crop | నీళ్లు లేక కరెంట్ రాక..సూర్యాపేట జిల్లాలో పంటను కాలబెట్టిన కౌలు రైతు
AP News | తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు..!
Ishan Kishan | ఇషాన్ కిషన్ కోలుకుంటున్నాడు.. అయినా మూడో టీ20కి దూరం.. బీసీసీఐ కీలక ప్రకటన!
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

