కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అవుటయ్యాడు. సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. కుల్దీప్ యాదవ్ వేసిన బంతిని ముందుకొచ్చి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన అయ్యర్.. బంతిని మిస్ అయ్యాడు. దాన్ని కలెక్ట్ చేసుకున్న కీపర్ రిషభ్ పంత్ వికెట్లను కూల్చడంతో శ్రేయాస్ మైదానం వీడాడు.
శ్రేయాస్ (54) వికెట్ పడటంతో కేకేఆర్ ఛేజింగ్ చేయడం కష్టంలా కనిపిస్తోంది. భారీ లక్ష్య ఛేదనలో శ్రేయాస్ ఒక్కడే కోల్‌కతాను విజయం వైపు నడిపించడానికి ప్రయత్నించాడు. ఓపెనర్లిద్దరూ తక్కువ స్కోర్లకే అవుటవగా.. నితీష్ రాణా (30) ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం క్రీజులో ఆండ్రీ రస్సెల్, శామ్ బిల్లింగ్స్ ఉన్నారు.