భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు తొలి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (18) అవుటయ్యాడు. ఖలీల్ అహ్మద్ వేసిన బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించిన వెంకటేశ్.. డీప్ స్క్వేర్ లెగ్‌లో అక్షర్ పటేల్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చాడు. దీంతో కోల్‌కతా తొలి వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత కాసేపటికే ఐదో ఓవర్ నాలుగో బంతికి అజింక్య రహానే కూడా అవుటయ్యాడు. ఖలీల్ అహ్మద్ వేసిన ఈ బంతిని రహానే గాల్లోకి లేపాడు. మిడాన్ నుంచి పరిగెత్తుకు వచ్చిన శార్దూల్ ఠాకూర్ ఆ క్యాచ్ పట్టేయడంతో రహానే మైదానం వీడాల్సి వచ్చింది. కోల్‌కతా జట్టు 38 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది.