భారీ లక్ష్య ఛేదనలో కోల్కతా జట్టు తడబడుతోంది. శ్రేయాస్ అయ్యర్ (54) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కీపర్ శామ్ బిల్లింగ్్ (15) ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. అతను ఆడిన స్లాగ్ షాట్ టైమింగ్ సరిగా లేకపోవడంతో ఫీల్డర్ లలిత్ యాదవ్ చేతుల్లోకి వెళ్లిందా బంతి.
దాంతో అతను నిరాశగా మైదానం వీడాల్సి వచ్చింది. ఐదు వికెట్లు కోల్పోయిన కేకేఆర్.. విజయానికి ఇంకా సుమారు 80 పరుగుల దూరంలో ఉంది. క్రీజులో రస్సెల్, కమిన్స్ ఉన్నారు. పదిహేను ఓవర్లు ముగిసే సరికి కోల్కతా జట్టు ఐదు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.