Kavya Maran: దంచికొట్టిన సన్‌రైజర్స్.. చిందేసిన కావ్య మారన్.. వీడియో
Kavya Maran: సిక్స్ కొట్టినా.. ఫోర్ కొట్టినా.. కావ్య మారన్ ఆ హిట్టింగ్‌ను ఎంజాయ్ చేసింది. ముంబైతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడుతుంటే.. స్టేడియంలోని స్టాండ్స్‌లో మ్యాచ్ వీక్షిస్తున్న ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ ప్రతి మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకున్నది. తనదైన స్టయిల్లో డ్యాన్స్ చేస్తూ ప్లేయర్లకు చీర్స్ చెప్పింది.
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు ఊర్రూతలూగించిన విషయం తెలిసిందే. హైదరాబాదీ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 277 పరుగుల స్కోర్ చేశారు. అయితే స్టాండ్స్‌లో మ్యాచ్‌ను వీక్షించిన ఆ జట్టు ఓనర్ కావ్య మారన్(Kavya Maran).. రన్ ఫీస్ట్‌ను ఫుల్ ఎంజాయ్ చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లు భారీ షాట్లు కొడుతుంటే.. కావ్య మారన్ స్టాండ్స్‌లో గంతులేస్తూ ఆ మజాను ఫీలైంది.
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్.. వీరవిహారం చేస్తుంటే.. ఆ సూపర్ మూమెంట్స్‌కు కావ్య తెగ థ్రిల్లైంది. తనకు నచ్చిన స్టయిల్లో స్టెప్పులేస్తూ.. ఆ హిట్టింగ్ టైమ్‌ను కంప్లీట్‌గా ఎంజాయ్ చేసింది. సన్‌రైజర్స్‌కు చెందిన ముగ్గురు బ్యాటర్లు శరవేగంగా హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఫస్ట్ ఐపీఎల్ ఆడుతున్న ట్రావిస్ హెడ్.. కేవలం 24 బంతుల్లో 62 రన్స్ చేశాడు. ఇక అభిషేక్ శర్మ కూడా 23 బంతుల్లో 63 రన్స్ చేశాడు. క్లాసెన్ 80, మార్క్రమ్ 42 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచారు. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్ చేసిన జట్టు ఘనత సన్‌రైజర్స్ దక్కించుకున్నది.
బ్యాటర్లను తన డ్యాన్స్‌తో చీర్ చేస్తున్న కావ్య మారన్‌పై.. నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఈ క్షణం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన వ్యక్తి కావ్య మారన్ అంటూ ట్విట్టర్లో కామెంట్లు చేశారు.
Kavya maran is the happiest person in the world right now🧡#kavyamaran #srh #SunrisersHyderabad #Sunrisers #IPL #TATAIPL2024 #IPLUpdate #IPL2024 #ipltickets #IPLonJioCinema #IPLticket #srhvsmi #srhvmi #mivssrh #mivsrh #MumbaiIndians#IPL2024live #crickettwitter #Hyderabad pic.twitter.com/6uxTVISkaG
— GOAT 31𓃵 (@daveyyyy31) March 27, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ENE Repeat | ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ అప్డేట్.. వచ్చేస్తోన్న మ్యాడ్ గ్యాంగ్!
‘ఓయూ, కేయూ వర్సిటీల పూర్వ విద్యార్థుల జాతీయ భావజాల సమ్మేళనానికి ఆహ్వానం’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

