లండన్ : ప్రతిష్టాత్మక వింబుల్డన్‌లో డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినర్ తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఆదివారం రాత్రి సుమారు 4 గంటల పాటు హోరాహోరీగా సాగిన పోరులో ఈ టాప్ సీడ్ ఇటలీ కుర్రాడు.. 6-7 (7/9), 7-6 (7/2), 6-3, 6-4తో అలగ్జాండెర్ జ్వెరెవ్ (జర్మనీ)ను చిత్తుచేసి వరుసగా రెండో ఏడాది టైటిల్ దక్కించుకున్నాడు.
తొలి సెట్‌ను కోల్పోయినా తర్వాత ధాటిగా ఆడిన సినర్.. వరుసగా మూడు సెట్లు గెలిచి విజేతగా నిలిచాడు.