Jacob Bethell : వన్డే ప్రపంచకప్-2027 సన్నాహకాల్లో భాగంగా ఓపెనింగ్ జోడీపై కసరత్తు చేస్తోంది ఇంగ్లండ్. బెన్ డకెట్(Ben Duckett)తో కలిసి శుభారంభాలు ఇచ్చే క్రికెటర్ కోసం వెతుకున్న ఇంగ్లండ్ వేల్స్ బోర్డుకు జాకబ్ బెథెల్(Jacob Bethell) ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ విధ్వంసక ఆటతో అలరిస్తున్న ఈ కుర్రాడిని భవిష్యత్ ఓపెనర్‌గా ఉపయోగించుకోవాలని ఈసీబీ భావిస్తోంది. ఈ క్రమంలోనే నాలుగులో ఆడుతున్న అతడిని భారత జట్టుతో వన్డే సిరీస్‌లోనే డకెట్‌కు జోడీగా పంపాలని యాజమాన్యం అనుకుంటోంది.
ఏడేళ్ల క్రితం ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో వన్డే ఛాంపియన్‌గా అవతరించిన ఇంగ్లండ్.. మరోసారి ట్రోఫీ లక్ష్యంగా సిద్ధమవుతోంది. మెగా టోర్నీకి మరో ఆరు నెలలే ఉండడంతో జట్టు కూర్పుపై ఈసీబీ దృష్టి సారించింది. అయితే.. ఓపెనర్ బెన్ డకెట్‌కు జోడీగా ఎవరూ సెట్ అవ్వడం లేదు.
ఈ మధ్య కాలంలో ఏకంగా నలుగురిని పరీక్షించినా.. ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, జాక్ క్రాలే, రెహాన్ అహ్మద్.. ఇలా నలుగురు మెప్పించలేకపోయారు. దాంతో.. ఈసారి జాకబ్ బెథెల్‌ను ఓపెనర్‌గా పంపాలని ఇంగ్లండ్ బోర్డు భావిస్తోంది.
Jacob Bethell is expected to open for England in the ODI series against India. It’s a promotion from his role at No. 4 and could also hint at a future move to the top of the order in Test cricket. He is set to become Ben Duckett’s fifth opening partner after Phil Salt, Jamie… pic.twitter.com/6Z5K6FgMWq
— Cricinfo (@cricinfo) July 4, 2026
వన్డే ప్రపంచకప్లోపే ఓపెనింగ్ జోడీ కుదరాలనే ఉద్దేశంతో చివరి అస్త్రంగా బెథెల్‌పై విశ్వాసం ఉంచుతోంది యాజమాన్యం. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఆడుతున్న ఈ యంగ్‌స్టర్‌ను టీమిండియా సిరీస్‌తోనే ఓపెనర్‌గా మార్చేస్తారని సమాచారం. ఎందుకంటే.. బెథెల్ ఇప్పటికే దూకుడైన ఆటతో తన సత్తా నిరూపించుకున్నాడు. ఇప్పటివరకూ 21 మ్యాచులు ఆడిన ఇతడు 19 ఇన్నింగ్స్‌ల్లో 33.50 సగటుతో 603 రన్స్ కొట్టాడు. ఇందులో ఐదు అర్ధ శతకాలుండగా, అత్యధిక వ్యక్తిగత స్కోర్.. 110.
More details ⤵️ https://t.co/MHflUYKKFl
— Cricinfo (@cricinfo) July 4, 2026
అలానే టెస్టుల్లోనూ బెథెల్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేసే అవకాశముంది. యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను కాచుకొని శతకంతో రెచ్చిపోయాడీ యంగ్‌స్టర్. చివరిదైన సిడ్నీ టెస్టులో 229 బంతుల్లో 142 రన్స్‌తో రెచ్చిపోయిన బెథెల్‌ను సుదీర్ఘ ఫార్మాట్లో బెన్ డకెట్‌కు జోడీగా ఆడించేందుకు ఈసీబీ పెద్దగా ఆలోచించకపోవచ్చు.