క్వార్టర్స్‌లో గాఫ్
అమెరికా యువ సంచలనం కొకొ గాఫ్.. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయిన గాఫ్ వరుస సెట్లలో నెగ్గి ముందంజ వేయగా.. జాబుర్, హద్దద్ మైయా కూడా క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్‌లో సిట్సిపాస్, రూడ్ ఫైనల్-8కు అర్హత సాధించారు.
- జాబుర్, హద్దద్ మైయా ముందంజ
- ఫైనల్-8లో సిట్సిపాస్, రూడ్
- ఫ్రెంచ్ ఓపెన్
అమెరికా యువ సంచలనం కొకొ గాఫ్.. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయిన గాఫ్ వరుస సెట్లలో నెగ్గి ముందంజ వేయగా.. జాబుర్, హద్దద్ మైయా కూడా క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్‌లో సిట్సిపాస్, రూడ్ ఫైనల్-8కు అర్హత సాధించారు.
పారిస్: ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌లో కొకొ గాఫ్ జోరు కొనసాగుతున్నది. నిరుడు ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్న అమెరికా యంగ్‌గన్ ఈ సారి చాంపియన్‌గా నిలువడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సోమవారం ఆరో సీడ్ గాఫ్ 7-5, 6-2తో షిమిడ్లోవాపై విజయం సాధించింది. ఆట ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన గాఫ్.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో విజృంభించింది.
గంటన్నరకు పైగా సాగిన పోరులో గాఫ్ 22 విన్నర్లు కొట్టగా.. ప్రత్యర్థి 17కే పరిమితమైంది. 6 బ్రేక్ పాయింట్లు ఖాతాలో వేసుకున్న గాఫ్.. తన నెట్‌గేమ్‌తో ఆకట్టుకుంది. నిరుడు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో హోరాహోరీగా తలపడిన డిఫెండింగ్ చాంపియన్, టాప్‌సీడ్ ఇగా స్వియాటెక్‌తో గాఫ్ ఈసారి క్వార్టర్స్‌లోనే తలపడే అవకాశాలు ఉన్నాయి. ఇతర మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ జాబుర్ 6-3, 6-1తో పెరాపై విజయం సాధించగా.. హద్దద్ మైయా 6-7 (3/7), 6-3, 7-5తో సొర్రిబెస్ టొర్మోపై గెలుపొందింది. క్వార్టర్ ఫైనల్లో ఈ ఇద్దరూ అమీతుమీ తేల్చుకోనున్నారు.
సిట్సిపాస్ సులువుగా..
పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్ సిట్సిపాస్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. నాలుగో రౌండ్లో సిట్సిపాస్ 7-5, 6-3, 6-0తో ఆఫ్నర్పై గెలిచి ముందంజ వేశాడు. గంటా 48 నిమిషాల పాటు సాగిన పోరులో సిట్సిపాస్ పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. 27 విన్నర్లు కొట్టిన అతడు 6 బ్రేక్ పాయింట్లు చేజిక్కించుకున్నాడు. మరోమ్యాచ్‌లో నాలుగో సీడ్ రూడ్ 7-6 (7/3), 7-5, 7-5తో జెర్రీపై విజయం సాధించాడు. తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా కీలక పాయింట్లు నెగ్గి ముందంజ వేసిన రూడ్.. ఆ తర్వాత మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. రూడ్ కన్నా జెర్రీ ఎక్కువ విన్నర్లు సంధించినా.. అనవసర తప్పిదాల కారణంగా అతడు మూల్యం చెల్లించుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

