MI vs KKR Live updates | ముంబై ఇండియన్స్ Vs కోల్‌కతా నైట్ రైడర్స్ లైవ్ అప్డేట్స్
IPL-2023 MI vs KKR Live updates | ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతన్నది. ఇది ఈ సీజన్లో 22వ మ్యాచ్. సీజన్లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది.
ముంబై: ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతన్నది. ఇది ఈ సీజన్లో 22వ మ్యాచ్. సీజన్లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండింట్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తీరాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. మ్యాచ్‌కు సంబంధించిన లైవ్ అప్డేట్స్ పాఠకుల కోసం..
-
16 Apr 2023 07:23 PM (IST)
చెలరేగిన ఇషాన్, సూర్య.. కోల్‌కతాకు మూడో ఓటమి
ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ సొంత గ్రౌండ్లో అదరగొట్టింది. లీగ్‌లో రెండో విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ ఇషాన్ కిషన్(58) ధనాధన్ బ్యాటింగ్‌కు సూర్యకుమార్ యాదవ్(43), తిలక్ వర్మ(30), టిమ్ డెవిడ్(24) మెరుపులు తోడవ్వడంతో 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కోల్‌కతా ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ వీరోచిత శతకం వృథా అయింది. నితీశ్ రానా సేన వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది.
SKY & @TilakV9 on the charge 🔥🔥@mipaltan need 39 off 43 now!
Follow the match ▶️ https://t.co/CcXVDhfzmi#TATAIPL | #MIvKKR | @surya_14kumar pic.twitter.com/tS20kFZM6N
— IndianPremierLeague (@IPL) April 16, 2023
-
16 Apr 2023 07:19 PM (IST)
ఐదో వికెట్ కోల్పోయిన ముంబై
ముంబై ఐదో వికెట్ కోల్పోయింది. ఫెర్గూసన్ బౌలింగ్‌లో నేహల్ రథీ(6) ఔటయ్యాడు. రివ్యూ తీసుకుని కోల్‌కతా అతడి వికెట్ సాధించింది.
-
16 Apr 2023 07:12 PM (IST)
సూర్య ఔట్.. విజయం దిశగా ముంబై
శార్దూల్ ఠాకూర్ వేసిన 17వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్(43) ఔటయ్యాడు. టిమ్ డేవిడ్(15), నేహల్ రథీ క్రీజులో ఉన్నారు.
-
16 Apr 2023 07:01 PM (IST)
టిమ్ డేవిడ్ బాదుతున్నాడు
టిమ్ డేవిడ్(15) బాదుతున్నాడు. వరుణ్ చక్రవర్తి, వేసిన 15వ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్(37) క్రీజులో ఉన్నాడు. 15 ఓవర్లకు ముంబై స్కోర్.. 163/3. ముంబై విజయానికి 30 బంతుల్లో 23 రన్స్ కావాలి.
Tim TONKED two & how! 💪 💪
Watch those MAXIMUMS from @timdavid8 🔽 #TATAIPL | #MIvKKR | @mipaltan pic.twitter.com/mbk13gFI7N
— IndianPremierLeague (@IPL) April 16, 2023
-
16 Apr 2023 06:54 PM (IST)
మూడో వికెట్ డౌన్
ముంబై మడో వికెట్ పడింది. సుయాశ్ శర్మ వేసిన 14వ ఓవర్లో తిలక్ వర్మ(30) బౌల్డ్ అయ్యాడు. సూర్యతో కలిసి తిలక్ మూడో వికెట్‌కు కీలకమైన 60 ప్లస్ రన్స్ జోడించాడు. టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చాడు.
-
16 Apr 2023 06:49 PM (IST)
దంచుతున్న సూర్య, తిలక్
సూర్యకుమార్ యాదవ్(37), తిలక్ వర్మ(30) దంచుతున్నారు. వీళ్లు మూడో వికెట్‌కు 60 రన్స్ జోడించారు. ఆండ్రూ రస్సెల్ వేసిన 13వ ఓవర్లో తిలక్ ఒక ఫోర్, సూర్య సిక్స్, ఫోర్ కొట్టాడు. దాంతో, 17 రన్స్ వచ్చాయి. 13 ఓవర్లకు ముంబై స్కోర్.. 147/2. ముంబై విజయానికి 42 బంతుల్లో 39 రన్స్ కావాలి.
-
16 Apr 2023 06:40 PM (IST)
సూర్య డబుల్ సిక్సర్
లాకీ ఫెర్గూసన్ వేసిన 11వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్(26) చెలరేగాడు. ఐదు, ఆరో బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, 13 రన్స్ వచ్చాయి. తిలక్ వర్మ(17) క్రీజులో ఉన్నాడు. 11 ఓవర్లకు ముంబై స్కోర్.. 123/2. ముంబై విజయానికి 54బంతుల్లో 61 రన్స్ కావాలి.
-
16 Apr 2023 06:34 PM (IST)
ముంబై స్కోర్ వంద
ముంబై స్కోర్ వంద దాటింది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో తిలక్ వర్మ(16) ఫోర్ కొట్టి ఇషాన్ ఫీఫ్టీ పూర్తి చేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్(14) క్రీజులో ఉన్నాడు. 10 ఓవర్లకు ముంబై స్కోర్.. 110/2. ముంబై విజయానికి 60 బంతుల్లో 76 రన్స్ కావాలి.
-
16 Apr 2023 06:23 PM (IST)
హాఫ్ సెంచరీ కొట్టి ఔటైన ఇషాన్
దంచి కొడుతున్న ఇషాన్ కిషన్ (58) ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన అతను ఆ తర్వాతి బంతికి బౌల్డ్ అయ్యాడు. దాంతో, 87 రన్స్ వద్ద ముంబై రెండో వికెట్ పడింది. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి ఇషాన్ ఫీఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 21 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో అతను యాభై రన్స్ కొట్టాడు. దాంతో, ముంబై స్కోర్ 80 దాటింది. సూర్యకుమార్ యాదవ్(7), తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు.
TIMBER!
Ishan Kishan departs not before scoring a cracking 52 off just 22 deliveries 💪@mipaltan moving along nicely in the chase!
Follow the match ▶️ https://t.co/CcXVDhfzmi#TATAIPL | #MIvKKR pic.twitter.com/gmAEYXYIwO
— IndianPremierLeague (@IPL) April 16, 2023
-
16 Apr 2023 06:12 PM (IST)
పవర్ ప్లేలో ముంబై స్కోర్
పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టానికి 72 పరుగులు స్కోర్ చేసింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్(5) బౌండరీ కొట్టాడు. ఇషాన్ కిషన్ (45) క్రీజులో ఉన్నాడు. ముంబై విజయానికి 84 బంతుల్లో 114 రన్స్ కావాలి.
-
16 Apr 2023 06:07 PM (IST)
ముంబైకి షాక్.. రోహిత్ ఔట్
ముంబైకి షాక్.. కెప్టెన్ రోహిత్ శర్మ(20) ఔటయ్యాడు. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్ డైవింగ్ క్యాచ్ పట్టడంతో అతను పెవిలియన్ చేరాడు. దాంతో, 65 వద్ద ముంబై తొలి వికెట్ పడింది. ఇషాన్ కిషన్ (43), సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లకు ముంబై స్కోర్.. 65/1.
That was one fine CATCH! 👌 👌
Relive how @y_umesh went aerial to grab a superb catch to dismiss Rohit Sharma! 👍 👍
Follow the match ▶️ https://t.co/CcXVDhfzmi#TATAIPL | #MIvKKR | @KKRiders pic.twitter.com/0rS6f63QqD
— IndianPremierLeague (@IPL) April 16, 2023
-
16 Apr 2023 06:03 PM (IST)
ఇషాన్ వీరబాదుడు
ఇషాన్ కిషన్ (42)వీర బాదుడు బాదుతున్నాడు. సునీల్ నరైన్ వేసిన నాలుగో ఓవర్లో రెండు సిక్స్‌లు, ఒక బౌండరీ బాదాడు. దాంతో, 22రన్స్ వచ్చాయి. రోహిత్ శర్మ(13) క్రీజులో ఉన్నాడు.. 4 ఓవర్లకు ముంబై స్కోర్.. 57/0.
.@mipaltan are off to a flying start in the chase! ✈️@ishankishan51 & @ImRo45 take #MI to 57/0 after 4 overs. 💪 💪
Follow the match ▶️ https://t.co/CcXVDhfzmi#TATAIPL | #MIvKKR pic.twitter.com/bAooTmUEpf
— IndianPremierLeague (@IPL) April 16, 2023
-
16 Apr 2023 05:58 PM (IST)
రోహిత్, ఇషాన్ సిక్సర్ల మోత
రోహిత్ శర్మ(9), ఇషాన్ కిషన్ (26) దంచుతున్నారు. ఉమేశ్ యాదవ్ వేసిన మూడో ఓవర్ రెండో బంతికి రోహిత్ సిక్స్ బాదాడు. ఆ తర్వాత ఇషాన్ ఒక ఫోర్, సిక్స్ కొట్టాడు.దాంతో, 17 రన్స్ వచ్చాయి. 3 ఓవర్లకు ముంబై స్కోర్.. 35/0.
-
16 Apr 2023 05:52 PM (IST)
రెండో ఓవర్లో దంచిన ఇషాన్
ఇషాన్ కిషన్ (16) దంచి కొడుతున్నాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన రెండో ఓవర్లో అతను వరుసగా రెండు ఫోర్లు, సిక్స్ బాదాడు. దాంతో, 16 రన్స్ వచ్చాయి. రోహిత్ శర్మ(1) క్రీజులో ఉన్నాడు. 2 ఓవర్లకు ముంబై స్కోర్.. 18/0.
-
16 Apr 2023 05:46 PM (IST)
తొలి ఓవర్లో 2 రన్స్
ఈ సీజన్లో తొలిసారి రోహిత్ శర్మ(1) ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు. ఉమేశ్ యాదవ్ వేసిన తొలి ఓవర్లో 2 రన్స్ వచ్చాయి. ఇషాన్ కిషన్ (1) క్రీజులో ఉన్నాడు.
-
16 Apr 2023 05:28 PM (IST)
ముంబై ఇండియన్స్ లక్ష్యం 186
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. మొత్తం నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా టీమ్ 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఓపెనింగ్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ 104 పరుగులు రాబట్టడంతో ముంబై ఇండియన్స్ ముందు 186 పరుగుల భారీ లక్ష్యం ఉంది.
-
16 Apr 2023 05:22 PM (IST)
రింకూ సింగ్ ఔట్.. 19 ఓవర్లలో కోల్‌కతా స్కోర్ 175/6
కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్ ఔటయ్యాడు. 19వ ఓవర్ ఐదో బంతికి జాన్సెన్ బౌలింగ్‌లో నేహల్ వదేరాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ ముఖం పట్టాడు. అప్పటికి రింకూ 18 బంతుల్లో రెండు ఫోర్లతో 18 పరుగులు చేశాడు. 19 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులకు చేరింది.
-
16 Apr 2023 05:14 PM (IST)
18 ఓవర్లలో 160/5.. కోల్‌కతా స్కోర్
కోల్‌కతా నైట్ రైడర్స్ 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులకు చేరింది. ప్రస్తుతం రింకూ సింగ్ 17 బంతుల్లో 18 పరుగులు, అండ్రూ రస్సెల్ రెండు బంతుల్లో 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
-
16 Apr 2023 05:11 PM (IST)
అయ్యర్ ఔట్.. కోల్‌కతా స్కోర్ 159/5
మ్యాచ్ ప్రారంభం నుంచి వీరవిహారం చేసిన కోల్‌కతా ఓపెనింగ్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ చివరికి 18వ ఓవర్ రెండో బంతికి రిలే మెరెడిట్ బౌలింగ్‌లో జాన్సెన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి అయ్యర్ స్కోరు 104 పరుగులు. మొత్తం 51 బంతుల్లో 9 సిక్సులు, 6 ఫోర్లతో అయ్యర్ 104 పరుగులు చేశాడు.
-
16 Apr 2023 05:06 PM (IST)
వెంకటేశ్ అయ్యర్ సెంచరీ..
ఐపీఎల్ సీజన్ 16లో రెండో సెంచరీ నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సెంచరీ చేయగా.. ఇవాళ కోల్‌కతా బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ సెంచరీ బాదాడు. అయ్యర్ కేవలం 49 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లతో సెంచరీ పూర్తిచేసుకున్నాడు.
-
16 Apr 2023 05:03 PM (IST)
16 ఓవర్లలో కోల్‌కతా స్కోర్ 146/4
కోల్‌కతా నైట్ రైడర్స్ స్కోరు బోర్డులో పరుగుల వేగం మందగించింది. సెంచరీకి చేరువైన తర్వాత వెంకటేశ్ అయ్యర్ జోరు తగ్గించాడు. మరో ఎండ్‌లో ఉన్న రింకూ సింగ్‌తో కలిసి సింగిల్స్ తీస్తున్నాడు. దాంతో 16 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 146/4 పరుగులతో ఉంది. అయ్యర్ 98 పరుగులతో సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచాడు.
-
16 Apr 2023 04:58 PM (IST)
15 ఓవర్లు కంప్లీట్.. వెంకటేశ్ అయ్యర్ 97
కోల్‌కతా ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ సెంచరీకి చేరువయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి అయ్యర్ 45 బంతుల్లో 97 పరుగులతో ఉన్నాడు. అందులో 9 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. జట్లు స్కోర్ 140/4గా ఉన్నది.
-
16 Apr 2023 04:53 PM (IST)
14 ఓవర్లు పూర్తి.. కోల్‌కతా స్కోర్ 135/4
వెంకటేశ్ అయ్యర్ వీరవిహారం చేయడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కేవలం 14 ఓవర్లలోనే నాలుగు వికెట్ల నష్టానికి 135 పరగులు చేసింది. అందులో అయ్యర్ చేసిన పరుగులే 95 ఉన్నాయి. మొత్తం 9 సిక్సులు, 5 ఫోర్లతో అయ్యర్ 95 పరుగులు పిండుకుని సెంచరీకి చేరువయ్యాడు.
-
16 Apr 2023 04:48 PM (IST)
నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కతా.. శార్దూల్ ఠాకూర్ ఔట్
కోల్‌కతా బ్యాటర్ శార్ధూల్ ఠాకూర్ 13వ ఓవర్ ఐదో బంతికి ఔటయ్యాడు. 11 బంతుల్లో 13 పరుగులు చేసి శార్ధూల్ పెవిలియన్‌కు చేరాడు. దాంతో క్రీజులోకి వచ్చిన రింకూసింగ్ ఆ తర్వాత బంతికి సింగిల్ తీశాడు. 13 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 125 పరుగులకు చేరింది.
-
16 Apr 2023 04:43 PM (IST)
12 ఓవర్లలో కోల్‌కతా స్కోర్ 117/3
కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తోంది. 12 ఓవర్లలో ఆ జట్టు మూడు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లు ఎవరూ అంతగా రాణించకపోయినా వెంకటేశ్ అయ్యర్ ఒంటిచేత్తో స్కోర్ బోర్డును ఉరకలు పెట్టిస్తున్నాడు. ఇప్పటికే 8 సిక్సులు, 5 ఫోర్లతో 80కి పైగా పరుగులు చేశాడు.
-
16 Apr 2023 04:38 PM (IST)
11వ ఓవర్లో వంద పరుగుల మార్కు దాటిన కోల్‌కతా
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు స్కోరు వంద పరుగుల మార్కును దాటింది. 11 ఓవర్లలో కోల్‌కతా టీమ్ స్కోర్ 104/3కి చేరింది. వెంకటేశ్ అయ్యర్ 76 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
16 Apr 2023 04:32 PM (IST)
10 ఓవర్లలో కోల్‌కతా స్కోర్ 90/3
కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్స్ వచ్చిన వాళ్లు వచ్చినట్టు ముగ్గురు పెవిలియన్ బాటపట్టినా స్కోరు బోర్డు మాత్రం పరుగులు పెడుతూనే ఉంది. ఓపెనింగ్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ వీరవిహారంతో స్కోర్ బోర్డు పరుగులు తీస్తున్నది. అయ్యర్ 29 బంతుల్లో ఐదు సిక్సులు, ఐదు ఫోర్లతో 63 పరుగులు పిండుకున్నాడు.
-
16 Apr 2023 04:28 PM (IST)
వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీ
కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్.. హృతిక్ శోకీన్ బౌలింగ్‌లో తొమ్మిదో ఓవర్ నాలుగో బంతికి బౌండరీతో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత డాట్ బాల్ ఆడి ఆఖరి బంతిని సిక్సర్ కొట్టాడు. దాంతో తొమ్మిదో ఓవర్ ముగిసే సరికి అయ్యర్ స్కోరు 25 బంతుల్లో 59 పరుగులకు చేరింది.
-
16 Apr 2023 04:24 PM (IST)
కెప్టెన్ నితీశ్ రాణా ఔట్.. కోల్‌కతా స్కోర్ 73/3
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా తొమ్మిదో ఓవర్ తొలి బంతికి రమణ్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో హృతిక్ శోకీన్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి అతని స్కోరు 10 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే.
-
16 Apr 2023 04:21 PM (IST)
కోల్‌కతా స్కోర్ 8 ఓవర్లలో 73/2
ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ దూకుడుతో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ కేవలం 8 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 22 బంతుల్లో 49 పరుగుల (సిక్సులు 4, ఫోర్లు 4) తో క్రీజులో ఉన్నాడు.
-
16 Apr 2023 04:17 PM (IST)
వెంకటేశ్ అయ్యర్ జోరు.. ఏడు ఓవర్లకు స్కోర్ 68/2
కోల్‌కతా ఓపెనింగ్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ జోరు కొనసాగుతున్నది. కేవలం 20 బంతుల్లోనే నాలుగు సిక్సులు, నాలుగు ఫోర్లతో 48 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ నితీశ్ రాణా రెండు పరుగులతో ఉన్నాడు.
-
16 Apr 2023 04:11 PM (IST)
ఆరు ఓవర్లలో కోల్‌కతా స్కోర్ 57/2
ఆరు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రెండు వికెట్లు నష్టపోయి 57 పరుగులు చేసింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ నితీశ్ రాణా క్రీజులో ఉన్నారు.
-
16 Apr 2023 04:09 PM (IST)
రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కతా
ఆరో ఓవర్ తొలి బంతికి కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఆరో ఓవర్ మూడో బంతికి రహమానుల్లా గుర్బాజ్.. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో జాన్సెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి గుర్బాజ్ స్కోరు 12 బంతుల్లో 8 పరుగులు.
-
16 Apr 2023 04:05 PM (IST)
ఐదు ఓవర్లలో కోల్‌కతా స్కోర్ 55/1
కోల్‌కతా ఓపెనింగ్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ వీరవిహారం చేస్తున్నాడు. కేవలం 15 బంతుల్లో నాలుగు సిక్సులు, రెండు ఫోర్లతో మొత్తం 38 పరుగులు చేశాడు. మరోవైపు రహమానుల్లా గుర్బాజ్ 10 బంతులు ఎదుర్కొని కేవలం 7 పరుగులు మాత్రమే రాబట్టాడు.
-
16 Apr 2023 04:00 PM (IST)
వెంకటేశ్ అయ్యర్ బౌండరీల మోత.. నాలుగు ఓవర్లలో స్కోర్ 39/1
కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ బౌండరీల మోతా మోగిస్తున్నాడు. కేవలం 11 బంతులు ఆడి రెండు సిక్సులు, రెండు ఫోర్లతో 24 పరుగులు చేశాడు. దాంతో నాలుగు ఓవర్లు ముగిసే సరికి జట్టు స్కోరు ఒక వికెట్ నష్టానికి 39 పరుగులకు చేరింది.
-
16 Apr 2023 03:51 PM (IST)
మూడు ఓవర్లలో 25 పరుగులు చేసిన కోల్‌కతా
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మూడు ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. తొలి ఓవర్ కట్టుదిట్టంగా వేసి కేవలం నాలుగు పరుగులే ఇచ్చిన అర్జున్ టెండూల్కర్.. మూడో ఓవర్లో (తన రెండో ఓవర్) ఏకంగా 13 పరుగులు సమర్పించుకున్నాడు.
-
16 Apr 2023 03:44 PM (IST)
తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా టీమ్
కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ తొలి వికెట్ కోల్పోయింది. కామెరూన్ గ్రీన్ వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి ఎన్ జగదీశన్ పరుగులేమీ చేయకుండానే హృతిశ్ శోకీన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
-
16 Apr 2023 03:37 PM (IST)
తొలి ఓవర్ వేసిన సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్
టీమిండియా మాజీ క్రికెటర్, స్టార్ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న అర్జున్ ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్ బౌల్ చేసి కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
-
16 Apr 2023 03:33 PM (IST)
కోల్‌కతా, ముంబై సబ్‌స్టిట్యూట్ ప్లేయర్స్
కోల్‌కతా నైట్ రైడర్స్: సుయాశ్ శర్మ, డేవిడ్ వీస్, అనుకుల్ రాయ్, మన్దీప్ సింగ్, వైభవ్ ఆరోరా.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, రమణ్‌దీప్ సింగ్, అర్షద్ ఖాన్, విష్ణు వినోద్, కుమార్ కార్తికేయ.
-
16 Apr 2023 03:30 PM (IST)
కోల్‌కతా, ముంబై తుది జట్లు ఇవే..
కోల్‌కతా నైట్ రైడర్స్: రహముల్లా గుర్జాబ్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, ఎన్ జగదీశన్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, అండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, లోకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి.
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, నేహల్ వదేరా, అర్జున్ టెండూల్కర్, హృతిక్ శోకీన్, పీయూష్ చావ్లా, దువాన్ జాన్సెన్, రిలే మెరెడిత్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

