IPL 2023 | ఢిల్లీ క్యాపిటల్స్ VS కోల్‌కతా నైట్ రైడర్స్ లైవ్ అప్డేట్స్
ఐపీఎల్ 16వ సీజన్ 28వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. టోర్నమెంట్లో ఇప్పటి వరకు బోణీ కొట్టని ఢిల్లీ విజయం సాధించాలనే కసితో ఉంది. గత మ్యాచ్‌లో ముంబై చేతిలో షాక్ తిన్న కోల్‌కతా గెలుపు బాట పట్టాలని భావిస్తోంది.
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ 28వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. టోర్నమెంట్లో ఇప్పటి వరకు బోణీ కొట్టని ఢిల్లీ విజయం సాధించాలనే కసితో ఉంది. గత మ్యాచ్‌లో ముంబై చేతిలో షాక్ తిన్న కోల్‌కతా గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వేదికగా ఈ ఆసక్తికర పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది.
-
20 Apr 2023 11:20 PM (IST)
ఫిలిప్ ఔట్.. మూడో వికెట్ డౌన్
ఢిల్లీ మూడో వికెట్ పడింది. అంకుల్ రాయ్ బౌలింగ్‌లో ఫిలిప్ సాల్ట్(5) ఔటయ్యాడు. దాంతో, 67 రన్స్ వద్ద ఢిల్లీ మరో వికెట్ పడింది. డేవిడ్ వార్నర్(45), మనీశ్ పాండే క్రీజులో ఉన్నారు.
-
20 Apr 2023 11:15 PM (IST)
రెండో వికెట్ డౌన్
ఢిల్లీ రెండో వికెట్ పడింది. నితీశ్ రానా బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ (2) ఔటయ్యాడు. డేవిడ్ వార్నర్(45), ఫిలిప్ సాల్ట్ క్రీజులో ఉన్నారు.
-
20 Apr 2023 11:07 PM (IST)
వార్నర్ 4 బౌండరీలు.. ఢిల్లీ స్కోర్ 61
ఢిల్లీ సునీల్ నరైన్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్(24) నాలుగు బౌండరీలు కొట్టాడు. దాంతో, ఢిల్లీ స్కోర్ 60 దాటింది. 17 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు స్కోర్.. 61/1
-
20 Apr 2023 11:00 PM (IST)
తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో పృథ్వీ షా(13) బౌల్డ్ అయ్యాడు. డేవిడ్ వార్నర్(24) క్రీజులో ఉన్నాడు.
.@chakaravarthy29 with the first success for @KKRiders 👌👌#DC reach 62/1 after 7 overs.
Follow the match ▶️ https://t.co/CYENNIiaQp #TATAIPL | #DCvKKR pic.twitter.com/R2sh4w0F69
— IndianPremierLeague (@IPL) April 20, 2023
-
20 Apr 2023 10:55 PM (IST)
3 ఓవర్లకు 31 రన్స్
ఢిల్లీ ఓపెనర్లు దంచుతున్నారు. ఆండ్రూ రస్సెల్ వేసిన మూడో ఓవర్లో డేవిడ్ వార్నర్(23) రెండు బౌండరీ బాదాడు. 12పరుగులు వచ్చాయి. పృథ్వీ షా(7) క్రీజులో ఉన్నాడు.
-
20 Apr 2023 10:49 PM (IST)
దంచుతున్న ఓపెనర్లు
ఢిల్లీ ఓపెనర్లు దంచుతున్నారు. కుల్వంత్ ఖెజ్రోలియా వేసిన రెండో ఓవర్లో డేవిడ్ వార్నర్(13) రెండు, పృథ్వీ షా(6) ఒక బౌండరీ బాదారు. 13 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లకు స్కోర్.. 19/0
-
20 Apr 2023 10:44 PM (IST)
తొలి ఓవర్లో6 పరుగులు
ఉమేశ్ యాదవ్ వేసిన తొలి బంతికే డేవిడ్ వార్నర్(5) బౌండరీ బాదాడు. 6 పరుగులు వచ్చాయి. పృథ్వీ షా(1) క్రీజులో ఉన్నాడు.
-
20 Apr 2023 10:25 PM (IST)
చెలరేగిన ఢిల్లీ బౌలర్లు.. కోల్‌కతా 127 ఆలౌట్
ముఖేశ్ కుమార్ వేసిన 20వ ఓవర్లో ఆండ్రూ రస్సెల్(38) దంచాడు. హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. 19 రన్స్ వచ్చాయి. ఆఖరి బంతికి వరుణ్ చక్రవర్తి రనౌటయ్యాడు. దాంతో కోల్‌కతా 127 పరుగులకు ఆలౌట్ అయింది.
గెలవక తప్పని మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు సత్తా చాటారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను కట్టడి చేశారు. ఢిల్లీ బౌలర్ల ధాటికి ప్రధాన బ్యాటర్లంతా చేతులెత్తేశారు. జేసన్ రాయ్(43) టాప్ స్కోరర్. ఆఖర్లో ఆండ్రూ రస్సెల్(38) పోరాడడంతో కోల్‌కతా స్కోర్ వంద దాటింది.
Innings break!
An all-round bowling performance from @DelhiCapitals restricts #KKR to 127 in the first innings.
Can @KKRiders defend this? Chase coming up shortly!
Scorecard ▶️ https://t.co/CYENNIiaQp #TATAIPL | #DCvKKR pic.twitter.com/onOyC4qhlL
— IndianPremierLeague (@IPL) April 20, 2023
మరోసారి కొత్త ఓపెనింగ్ జోడీని పరీక్షించిన కోల్‌కతాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ లిట్టన్ దాస్ (4)ను రెండో ఓవర్లో ముఖేశ్ కుమార్ ఔట్ చేశాడు. గత మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన వెంకటేశ్ అయ్యర్(0)ను అన్రిజ్ నార్జ్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత నితీశ్ రానా(4)ను ఇషాంత్ శర్మ ఔట్ చేశాడు. దాంతో, 32 రన్స్‌కే మూడు వికెట్లు పడ్డాయి. మన్దీప్ సింగ్(12)ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేయడంతో కోల్‌కతా కష్టాల్లో పడింది. రింకూ సింగ్(5), సునీల్ నరైన్(4) విఫలమయ్యారు. 70 పరుగులకే ఆరు వికెట్లు పడిన కోల్‌కతాను జేసన్ రాయ్(43), ఆండ్రూ రస్సెల్() ఆదుకున్నారు. అయితే... కుల్దీప్ యాదవ్ 15వ ఓవర్లో వరుస బంతుల్లో జేసన్ రాయ్(43), ఇంపాక్ట్ ప్లేయర్ అంకుల్ రాయ్(0)ను ఔట్ చేశాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ అన్రిజ్ నార్జ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.
-
20 Apr 2023 10:15 PM (IST)
కోల్‌కతా స్కోర్ వంద
ఆండ్రూ రస్సెల్(19) స్పీడ్ పెంచాడు. అన్రిజ్ నార్జ్ వేసిన 18వ ఓవర్లో బౌండరీ బాదాడు. దాంతో, కోల్‌కతా స్కోర్ వంద దాటింది. వరుణ్ చక్రవర్తి(0) క్రీజులో ఉన్నాడు. 18ఓవర్లకు స్కోర్..105/9.
-
20 Apr 2023 09:59 PM (IST)
తొమ్మిదో వికెట్ డౌన్
ఉమేశ్ యాదవ్(3) ఔటయ్యాడు. అన్రిజ్ నార్జ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దాంతో, కోల్‌కతా తొమ్మిదో వికెట్ కోల్పోయి ఆలౌట్ ప్రమాదలో పడింది.
Double-strike alert ⚡️⚡️
Jason Roy and Anukul Roy depart back-to-back as @imkuldeep18 strikes! #KKR are 9⃣ down now
Follow the match ▶️ https://t.co/CYENNIiaQp #TATAIPL | #DCvKKR pic.twitter.com/5uLpGwRY58
— IndianPremierLeague (@IPL) April 20, 2023
-
20 Apr 2023 09:56 PM (IST)
ఒకే ఓవర్లో రెండు వికెట్లు
కోల్‌కతా మరింత కష్టాల్లో పడింది. కుల్దీప్ యాదవ్ వరుస బంతుల్లో జేసన్ రాయ్(43), ఇంపాక్ట్ ప్లేయర్ అంకుల్ రాయ్(0)ను ఔట్ చేశాడు. హ్యాట్రిక్ బంతికి ఉమేశ్ యాదవ్(1) సింగిల్ తీశాడు. ఆండ్రూ రస్సెల్(13) క్రీజులో ఉన్నాడు. 15 ఓవర్లకు స్కోర్..94/8.
-
20 Apr 2023 09:51 PM (IST)
జేసన్ రాయ్ ఔట్
కోల్‌కతా ఏడో వికెట్ పడింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో జేసన్ రాయ్(43) ఔటయ్యాడు. రాయ్ గాల్లోకి లేపిన బంతిని హకీం ఖాన్ అందుకున్నాడు. దాంతో, కోల్‌కతా మరింత కష్టాల్లో పడింది. ఆండ్రూ రస్సెల్(13) క్రీజులో ఉన్నాడు.
-
20 Apr 2023 09:39 PM (IST)
ఇషాంత్ ప్లేస్‌లో పృథ్వీ షా
ఇషాంత్ శర్మ కోటా పూర్తి కావడంతో ఢిల్లీ సబ్‌స్టిట్యూట్‌ను తీసుకుంది. అతని ప్లేస్‌లో పృథ్వీ షా మైదానంలోకి వచ్చాడు. ఇషాంతో 19 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. 13 ఓవర్లకు స్కోర్..77/6. జేసన్ రాయ్(37), ఆండ్రూ రస్సెల్(4) క్రీజులో ఉన్నారు.
Troubles increase further for #KKR but they still have Jason Roy & Andre Russell in the middle!@akshar2026 & @ImIshant add to the damage 💪
Follow the match ▶️ https://t.co/CYENNIiaQp#TATAIPL | #DCvKKR pic.twitter.com/6QahjyT0Na
— IndianPremierLeague (@IPL) April 20, 2023
-
20 Apr 2023 09:31 PM (IST)
ఆరో వికెట్ డౌన్
కోల్‌కతా ఆరో వికెట్ పడింది. సునీల్ నరైన్(4) ఔటయ్యాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో అతను కొట్టిన బంతిని బౌండరీ వద్ద డేవిడ్ వార్నర్ అందుకున్నాడు. దాంతో, కోల్‌కతా మరింత కష్టాల్లో పడింది.
-
20 Apr 2023 09:27 PM (IST)
డేంజరస్ రింకూ సింగ్ ఔట్
అక్షర్ పటేల్ బౌలింగ్‌లో డేంజరస్ రింకూ సింగ్(5) ఔటయ్యాడు. రింకూ గాల్లోకి లేపిన బంతిని బౌండరీ వద్ద లలిత్ యాదవ్ అందుకున్నాడు. దాంతో, స్వల్ప వ్యవధిలో కోల్‌కతా ఐదో వికెట్ కోల్పోయింది. జేసన్ రాయ్(34), సునీల్ నరైన్ క్రీజులో ఉన్నారు.
-
20 Apr 2023 09:24 PM (IST)
పది ఓవర్లకు స్కోర్ 64
కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో జేసన్ రాయ్(34) లాంగాన్‌లో సిక్స్ బాదాడు. 10 రన్స్ వచ్చాయి. రింకూ సింగ్(5) క్రీజులో ఉన్నాడు. 10 ఓవర్లకు స్కోర్.. 64/4
-
20 Apr 2023 09:18 PM (IST)
మన్దీప్ బౌల్డ్
అక్షర్ పటేల్ బిగ్ వికెట్ తీశాడు. 9వ ఓవర్ తొలి బంతికి మన్దీప్ సింగ్(12)ను బౌల్డ్ చేశాడు. స్వీప్ షాట్‌కు ప్రయత్నించిన మన్దీప్ బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు. దాంతో, 50 రన్స్ వద్ద కోల్‌కతా నాలుగో వికెట్ కోల్పోయింది. జేసన్ రాయ్(26), రింకూ సింగ్ క్రీజులో ఉన్నారు.
-
20 Apr 2023 09:05 PM (IST)
పవర్ ప్లేలో కోల్‌కతా స్కోర్
పవర్ ప్లేలో కోల్‌కతా 3 వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. ఇషాంత్ శర్మ వేసిన ఆరో ఓవర్లో ఒక వికెట్ తీసి నాలుగు రన్స్ ఇచ్చాడు. జేసన్ రాయ్(22), మన్దీప్ సింగ్(2) క్రీజులో ఉన్నారు.
-
20 Apr 2023 09:01 PM (IST)
బిగ్ వికెట్ తీసిన ఇషాంత్
ఇషాంత్ శర్మ బిగ్ వికెట్ తీశాడు. నితీశ్ రానా(4) ఔటయ్యాడు. ముఖేశ్ కుమార్ క్యాచ్ పట్టడంతో అతను పెవిలియన్ బాట పట్టాడు.
-
20 Apr 2023 08:58 PM (IST)
ఐదో ఓవర్లో 2 రన్స్
ముఖేశ్ కుమార్ వేసిన ఐదో ఓవర్లో 2 రన్స్ వచ్చాయంతే. జేసన్ రాయ్(20), కెప్టెన్ నితీశ్ రానా(4) క్రీజులో ఉన్నారు. ఐదు ఓవర్లకు స్కోర్.. 31/2
-
20 Apr 2023 08:51 PM (IST)
అయ్యర్ డకౌట్
కోల్‌కతా రెండో వికెట్ కోల్పోయింది. అన్రిజ్ నార్జ్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్(0) ఔటయ్యాడు. మిచెల్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జేసన్ రాయ్(19), కెప్టెన్ నితీశ్ రానా క్రీజులో ఉన్నారు.
Edged and Taken 🙌🏻
Mitchell Marsh grabs a magnificent catch to dismiss Venkatesh Iyer!#KKR are 3⃣ down inside the powerplay.
Follow the match ▶️ https://t.co/CYENNIiaQp #TATAIPL | #DCvKKR pic.twitter.com/AtjeltwvuR
— IndianPremierLeague (@IPL) April 20, 2023
-
20 Apr 2023 08:40 PM (IST)
తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా
కోల్‌కతా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ లిట్టన్ దాస్ (4) ఔటయ్యాడు. ముఖేశ్ కుమార్ వేసిన రెండో ఓవర్ ఆఖరి బంతికి లలిత్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
In the air and taken 💪
Mukesh Kumar strikes as Lalit Yadav takes the catch 👌👌#KKR lose Litton Das in the second over.
Follow the match ▶️ https://t.co/CYENNIiaQp #TATAIPL | #DCvKKR pic.twitter.com/nIc62sNREl
— IndianPremierLeague (@IPL) April 20, 2023
-
20 Apr 2023 08:17 PM (IST)
టాస్ గెలిచిన ఢిల్లీ
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచాడు. తేమ ఉండడంతో ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో, కోల్‌కతా నైట్ రైడర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.
-
20 Apr 2023 08:10 PM (IST)
8:15 గంటలకు టాస్
ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. వర్షం తగ్గడంతో 8:15 గంటలకు టాస్ వేయనున్నారు.
-
20 Apr 2023 08:04 PM (IST)
తగ్గిన వర్షం.. మరికాసేపట్లో టాస్
ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్. వర్షం తగ్గింది. దాంతో, గ్రౌండ్ సిబ్బంది పిచ్ మీద కప్పిన ప్లాస్టిక్ కవర్లను తొలగించారు. ఇరుజట్ల ఆటగాళ్లు, కోచ్‌లు మైదానంలోకి వచ్చి పిచ్‌ను పరిశీలిస్తున్నారు. మరికాసేపట్లో టాస్ వేయనున్నారు.
-
20 Apr 2023 07:36 PM (IST)
వర్షం కారణంగా టాస్ ఆలస్యం
ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగిస్తున్నాడు. దాంతో, గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ను పూర్తిగా ప్లాస్టిక్ కవర్లతో కప్పి ఉంచారు. వర్షం కారణంగా టాస్ మరింత ఆలస్యం కానుంది.
🚨 Update from Delhi 🚨
Toss delayed due to rain.
Pitch inspection at 7:00 PM IST #TATAIPL | #DCvKKR pic.twitter.com/mD0d3lCeeu
— IndianPremierLeague (@IPL) April 20, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

