విజేతలు.. మన దిగ్గజాలు

ఫైనల్లో లంకపై సచిన్ సేన గెలుపు
రాయ్‌పూర్: సచిన్ టెండూల్కర్ సారథ్యంలో భారత దిగ్గజాలు గర్జించారు. రోడ్ సెఫ్టీ ప్రపంచ సిరీస్ తుదిపోరులో శ్రీలంకను చిత్తుచేసి టైటిల్ కైవసం చేసుకున్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో ఇండియన్ లెజెండ్స్ జట్టు 14 పరుగుల తేడాతో శ్రీలంక లెజెండ్స్‌పై ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ (36 బంతుల్లో 62; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) బ్యాటింగ్‌లో రెచ్చిపోవడంతో పాటు బౌలింగ్‌లో లంక స్టార్లు సనత్ జయసూర్య (43), దిల్షాన్ (21) ను ఔట్ చేసి భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. యూసఫ్ సహా యువరాజ్ సింగ్ (41 బంతుల్లో 60) దుమ్మురేపడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సచిన్సేన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. కెప్టెన్ టెండూల్కర్ (30) ప్రారంభంలో దూకుడుగా ఆడి శుభారంభాన్నిచ్చాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో లంక లెజెండ్స్ టీమ్ తడబడింది. చివర్లో వీరవర్దెనె (38), జయ సింఘె (40) దూకుడుగా ఆడినా ఏడు వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో యూసఫ్, ఇర్ఫాన్ చెరో రెండు, మునాఫ్, గోనీ తలా ఓ వికెట్ తీసుకున్నారు. దిల్షాన్‌కు మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

