Team India : గాలే టెస్టులో భారీ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశల్నీ సజీవంగా ఉంచుకున్న భారత జట్టు.. సిరీస్‌పై కన్నేసింది. స్పిన్ అస్త్రంతో దెబ్బతీయానుకున్న శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా కొలంబో(Colombo Test)లోనూ చెలరేగాలని భావిస్తోంది. అరంగేట్రం మ్యాచ్‌లోనే మానవ్ సుతార్ 10 వికెట్లతో ఆకట్టుకోగా.. రెండో టెస్టులో ప్రయోగాలకు సిద్ధమవుతోంది భారత్. ఈసారి స్క్వాడ్‌లోని మరో ఆల్‌రౌండర్ డెబ్యూట్ క్యాప్ అందుకుంటాడని సమాచారం.
శ్రీలంక పర్యటనను విజయంతో ఆరంభించిన భారత జట్టు రెండో టెస్టుకు పక్కాగా సిద్ధమవుతోంది. దేవ్‌దత్ పడిక్కల్ శతకమోత, ఆపై మానవ్ సుతార్ తిప్పేయడంతో అలవోకగా గెలుపొందిన టీమిండియా.. కొలంబోలో మరో స్పిన్ అస్త్రాన్ని ఉపయోగించనుంది. ఎడమ చేతివాటం స్పిన్నరైన 33 ఏళ్ల సరాన్ష్ జైన్(Saransh Jain) ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
Selection dilemma for India ahead of the 2nd Test in Colombo! Is Kuldeep Yadav facing the axe? 🇮🇳🌀🇱🇰
• Subdued Outing: Left-arm wrist-spinner Kuldeep Yadav managed just 1/103 across 25 overs on a turning track in Galle! 📉
• Spin Competition: With Manav Suthar taking 10… pic.twitter.com/DxJeJy1Hb8
— Cricket Hub (@Anurag9793) August 20, 2026
దేశవాళీలో మధ్యప్రదేశ్ తరఫున అద్భుతంగా రాణించిన జైన్ గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో స్క్వాడ్‌లోకి వచ్చాడు. ప్రతిభావంతుడైన అతడికీ అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. జైన్‌ను ఆడించాలనుకుంటే తుది జట్టు నుంచి కుల్దీప్ యాదవ్‌ను తప్పించాల్సి వస్తుంది. గాలే టెస్టులో ఈ చైనామన్ బౌలర్ 25 ఓవర్లలో 103 పరుగులిచ్చి ఒకటే వికెట్ తీశాడు. దాంతో.. కుల్దీప్ను పక్కనపెట్టడం దాదాపు ఖాయం అనిపిస్తోంది. ఆగస్టు 23 నుంచి రెండో టెస్టు జరుగనుంది.
🚨33 year Old from MP on Debut 🚨
Saransh Jain First class record-
– Matches- 54
-Wickets-188
-Bowl Avg-27.30
– 5w Hauls-10
-Runs- 2,223
-Bat Avg- 31.75#saranshjain ##TeamIndia #Testcricket#INDvsSL pic.twitter.com/0zsdp17iMI— VEER SA (@veersaa007) July 28, 2026