Colombo Test : శ్రీలంక పర్యటనను విజయంతో ఆరంభించిన భారత జట్టు రెండో టెస్టుకు పక్కాగా సిద్ధమవుతోంది. అరంగేట్రం మ్యాచ్‌లోనే 10 వికెట్లతో రాణించిన మానవ్ సుతార్(Manav Suthar) తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. సీనియర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) ఎంపికపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. గాలే టెస్టులో విఫలమైన అతడిని పక్కన పెట్టేసి.. 33 ఏళ్ల సరాన్ష్ జైన్(Saransh Jain)ను కొలంబో టెస్టులో ఆడించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. స్పిన్ కోచ్ సాయిరాజ్ బహతులే మాత్రం కుల్దీప్ను వెనకేసుకొచ్చాడు.
గాలే టెస్టులో కుల్దీప్ యాదవ్ ఏమాత్రం ప్రభావం చూపలేదు. 25 ఓవర్లలో 103 పరుగులిచ్చి ఒకటే వికెట్ తీయడంతో కొలంబో టెస్టుకు అతడిని బెంచ్‌పై కూర్చోబెడతారని కథనాలు వచ్చాయి. అయితే.. అనుభవజ్ఞుడైన కుల్దీప్ పుంజుకుంటాడని, అతడొక మ్యాచ్ విన్నర్ అని స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహతులే అంటున్నాడు.
India spin-bowling coach Sairaj Bahutule explained why Kuldeep Yadav couldn’t add much to the wicket column in the first Test and said the team management is keeping its options open with regard to the inclusion of Saransh Jain 🗣️
Read more 👉 https://t.co/wQvies3qxl
✍️:… pic.twitter.com/oVJzdTgAgo
— Sportstar (@sportstarweb) August 21, 2026
‘కుల్దీప్ గొప్పగా బౌలింగ్ చేస్తున్నాడు. గాలేలో మాత్రం అతడు ప్రభావం చూపలేకపోయాడు. అతడు భిన్నమైన పాత్ర పోషించాల్సింది. నా దృష్టిలో అతడు ఎల్లప్పుడూ మ్యాచ్ విజేతనే. అయితే.. గాలేలో కొకాబుర్ర బంతి పాతబడిన తర్వాత ఫింగర్ స్పిన్నర్ల మాదిరిగా.. ఈ మణికట్టు స్పిన్నర్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోయాడు. అందుకని ఒక్క మ్యాచ్‌తోనే అతడిని తక్కువ అంచనా వేయొద్దు. కొలంబో టెస్టులోకుల్దీప్ కచ్చితంగా వికెట్లు తీస్తాడు’ అని బహతులే వెల్లడించాడు.
“He’s (Kuldeep) been bowling extremely well. It’s just the situation that arose in Galle; he had to play a different role. For me, he has always been a match-winner, and he definitely is in the scheme of things,” Sairaj Bahutule said.#SLvIND #TeamIndiahttps://t.co/G7lMwgwKqy
— Circle of Cricket (@circleofcricket) August 21, 2026
గాలే టెస్టులో భారీ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశల్నీ సజీవంగా ఉంచుకున్న భారత జట్టు.. సిరీస్‌పై కన్నేసింది. ఆగస్టు 23న కొలంబోలో గెలిస్తే.. టీమిండియా డబ్ల్యూటీసీలో ముందంజ వేస్తుంది. ఇక సరాన్ష్ జైన్ విషయానికొస్తే.. గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో టెస్టు స్క్వాడ్‌లోకి వచ్చాడు. దేశవాళీలో మధ్యప్రదేశ్ తరఫున రాణిస్తున్న అతడికీ అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. జైన్‌ను ఆడించాలనుకుంటే తుది జట్టు నుంచి కుల్దీప్ యాదవ్‌ను తప్పించాల్సి వస్తుంది.