Ravindra Jadeja : భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) టెస్టుల్లో మాత్రం చెత్త రికార్డు కొనసాగిస్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో గణాంకాల పరంగా మెరుగ్గానే ఉన్నప్పటికీ.. డీఆర్ఎస్(అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించడం)లో మాత్రం జడ్డూ తేలిపోతున్నాడు. ఇప్పటివరకూ అతడు వరుసగా 22 రివ్యూలను కోల్పోయాడు. వీటిలో నాలుగు దఫాలు మాత్రమే అంపైర్ కాల్‌గా వెళ్లాయి.
సుదీర్ఘ ఫార్మాట్లో దిగ్గజ ఆల్‌రౌండరైన రవీంద్ర జడేజా రివ్యూల్లో మాత్రం విఫలమవుతున్నాడు. ఈమధ్య జడ్డూ 22 డీఆర్ఎస్లు తీసుకోగా.. 18 రివ్యూలు వృథా అయ్యాయి. నాలుగుసార్లు మాత్రమే అంపైర్ కాల్ తీసుకున్నారు. దాంతో.. ఇన్నేసి రివ్యూలు కోల్పోయిన ఆల్‌రౌండర్‌గా జడేజా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.
Ravindra Jadeja has had his last 22 DRS reviews struck down as a bowler in Tests. Only four of them have turned out to be umpire’s call 🤯
His last successful review as a bowler came in the West Indies’ first innings in the Dominica Test in July 2023, with the dismissal of Kemar… pic.twitter.com/H6uqCc0OCR
— Cricinfo (@cricinfo) August 25, 2026
చివరిసారిగా 2023లో జడేజా తీసుకున్న రివ్యూ విజయవంతమైంది. ఆ ఏడాది జూలైలో డొమినికా టెస్టులో వెస్టిండీస్‌పై తొలి ఇన్నింగ్స్‌లో రివ్యూతో కీమర్ రోచ్ వికెట్ సాధించాడీ స్పిన్నర్. ఇప్పటివరకూ టెస్టుల్లో 15సార్లు ఐదువికెట్లు, మూడు దఫాలు పది వికెట్లతో కలిపి.. మొత్తంగా 352 వికెట్లు తీశాడీ వెటరన్. అతడి అత్యుత్తమ ప్రదర్శన 7జ42.