IND vs SA | సమఉజ్జీల పోరుకు రంగం సిద్ధం.. నేడు దక్షిణాఫ్రికాతో భారత్ ఢీ
IND vs SA | వన్డే ప్రపంచకప్‌లో అసలు సిసలు సమఉజ్జీల పోరుకు రంగం సిద్ధమైంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన టీమ్ఇండియా.. బాదుడే పరమావధిగా భారీ స్కోర్లు నమోదు చేస్తున్న దక్షిణాఫ్రికాతో అమీతుమీకి రెడీ అయింది.
IND vs SA | వన్డే ప్రపంచకప్‌లో అసలు సిసలు సమఉజ్జీల పోరుకు రంగం సిద్ధమైంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన టీమ్ఇండియా.. బాదుడే పరమావధిగా భారీ స్కోర్లు నమోదు చేస్తున్న దక్షిణాఫ్రికాతో అమీతుమీకి రెడీ అయింది. సఫారీల బ్యాటింగ్‌కు భారత బౌలింగ్‌కు మధ్య సమరంగా భావిస్తున్న పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి! పుట్టినరోజు (ఆదివారం) నాడు విరాట్ వీరోచిత ఇన్నింగ్స్ కోసం అభిమానుల ఎదురుచూపులు ఈడెన్ గార్డెన్స్‌లో ఫలించాలని ఆశిద్దాం!
కోల్‌కతా: ప్రత్యర్థులతో సంబంధం లేకుండా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతూ టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న భారత జట్టు ఆదివారం మరో కీలక మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ ఇలా ఎదురైన ప్రతి జట్టును మట్టికరిపించిన రోహిత్ సేన.. సఫారీలతో సమరానికి సై అంటున్నది. బలాబలాల దృష్ట్యా ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నా.. సఫారీల బౌలింగ్ దాడి కన్నా మన పేస్ బలంగా ఉందనేది వాస్తవం. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత బౌలర్లను సవాలు చేయగల బ్యాటింగ్ యూనిట్ తారస పడలేదనే భావన ప్రతి ఒక్కరిలో ఉండగా.. ఈ మ్యాచ్‌లో అలాంటి ఆర్డర్ ఎదురుపడనుంది.
వరల్డ్‌కప్‌లో భారత జైత్రయాత్రను అడ్డుకోవడమే తమ లక్ష్యమని ప్రొటీస్ కెప్టెన్ బవుమా మ్యాచ్‌కు ముందురోజు వెల్లడించాడు. న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ గెలవడంతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలువడం ఖాయమే కావడంతో ఫైనల్‌కు ముందు ఈ మ్యాచ్‌ను రిహార్సల్‌గా భావించొచ్చు. లేటు వయసులో ఘాటు ఆటతో ఆకట్టుకుంటున్న డికాక్‌తో పాటు డసెన్, మార్క్మ్,్ర క్లాసెన్, మిల్లర్, జాన్సెన్‌తో కూడిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్‌ను బుమ్రా, షమీ, సిరాజ్ త్రయం ఎలా అడ్డుకట్ట వేస్తుందనే దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. బ్యాటింగ్‌లో బర్త్‌డే బాయ్ విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్, శ్రేయస్, రాహుల్, సూర్య కీలకం కానున్నారు.
- 2011లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ లీగ్ దశలో భారత్ కేవలం దక్షిణాఫ్రికా చేతిలో మాత్రమే ఓడి.. మిగిలిన మ్యాచ్‌లన్నీ గెలిచి విశ్వ విజేతగా నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

