IND vs AUS : రవీంద్ర జేడజా మరోసారి ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు. ఒకే ఓవర్లో కమిన్స్, మర్ఫీని ఔట్ చేశాడు. టాడ్ మర్ఫిని బౌల్డ్ చేశాడు. దాంతో, ఆసీస్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. రెండో బంతికి కమిన్స్(33) ను ఎల్బీగా ఔట్ చేశాడు. అఖరి బంతికి మర్ఫీని బౌల్డ్ చేశాడు. దాంతో, ఆసీస్ ఆలౌట్ ప్రమాదంలో పడింది. ప్రమాదకరంగా మారుతున్న హ్యాండ్స్కాంబ్, కమిన్స్ జోడిని విడదీశాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో కమిన్స్ రివ్యూ తీసుకున్నాడు. కానీ, రిప్లేలో బంతి మిడిల్ స్టంప్స్‌ను తగిలింది. దాంతో, 227 వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. కమిన్స్, హ్యాండ్స్కాబ్ 59 రన్స్ జోడించారు. నాథన్ లయాన్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్.. 229/8.
మూడో సెషన్లో ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ హ్యాండ్స్కాంబ్ భారత స్పిన్నర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ కొట్టాడు. స్పిన్ ఎక్స్పర్ట్ అయిన ఇతను 110 బంతుల్లో అను అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు హ్యాండ్స్కాంబ్ క్రీజులోకి వచ్చాడు. 168 వద్ద ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్‌ను హ్యాండ్స్కాంబ్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆదుకున్నారు. ఓపికగా ఆడుతూ స్కోర్‌బోర్డును రెండొందలు దాటించారు.