పంజాబ్- హైదరాబాద్ మ్యాచ్ డ్రా
రంజీ తాజా సీజన్లో హ్యాట్రిక్ కొట్టాలన్న హైదరాబాద్ జట్టుకు నిరాశే ఎదురైంది. సొంతగడ్డపై పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌ను ఆ జట్టు డ్రాతో ముగించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : రంజీ తాజా సీజన్లో హ్యాట్రిక్ కొట్టాలన్న హైదరాబాద్ జట్టుకు నిరాశే ఎదురైంది. సొంతగడ్డపై పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌ను ఆ జట్టు డ్రాతో ముగించింది. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై పంజాబ్ బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే చెలరేగి తమ జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు.ఓవర్‌నైట్ స్కోరు 57/0తో గురువారం క్రీజులోకి వచ్చిన పంజాబ్.. మాచ్ చివరి రోజు 240/6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది.
ప్రభ్‌సిమ్రన్ సింగ్ (68), కెప్టెన్ ఉదయ్ సహరన్ (55 నాటౌట్), విహాన్ మల్హోత్ర (53) అర్ధశతకాలతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ రెడ్డి (2/16), తనయ్ త్యాగరాజన్ (2/51) తలా రెండు వికెట్లు పడగొట్టారు. మ్యాచ్ డ్రా అవగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో పంజాబ్ మూడు పాయింట్లు అందుకోగా.. హైదరాబాద్‌కు ఒకే పాయింట్ దక్కింది. అయినా పాయింట్ల పట్టికలో ఎలైట్ గ్రూప్-బీలో హైదరాబాద్ 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

