Hardik Pandya | మళ్లీ పెళ్లి చేసుకున్న హార్ధిక్ పాండ్యా- నటాషా.. ఫొటోలు వైరల్
టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజు (ఫిబ్రవరి 14న) ఉదయ్‌పూర్ వేదికగా వైభవంగా ఈ జంట వివాహం చేసుకుంది. హార్ధిక్ - నటాషాలు ఇంతకుముందు 2020 మే 31న కోర్టులో పెళ్లి చేసుకున్నారు.
Hardik Pandya : టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈరోజు తన భార్య నటాషా స్టాంకోవిక్‌ను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. వాలెంటైన్స్ డే అయిన ఫిబ్రవరి 14న ఉదయ్‌పూర్‌లో వైభవంగా వీళ్ల వివాహం జరిగింది. మూడేళ్ల క్రితమే పాండ్యా నటాషా వివాహం చేసుకున్నారు. పాండ్యా- నటాషా.. తమ పెళ్లి ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ‘ప్రేమకు చిరునామా అయిన ఈ ఐలాండ్‌లో వాలెంటైన్స్ డే నాడు మేము పెళ్లి చేసుకున్నాం. మూడేళ్ల క్రితం అనుకున్న మాటను నిజం చేసుకున్నాం’ అని క్యాప్షన్ రాశాడు.
పాండ్యా, నటాషా ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఈ జంటకు రెండున్నర ఏళ్ల అగస్త్య అనే బాబు కూడా ఉన్నాడు. వివాహం అనంతరం హార్ధిక్ – నటాషాలు తమ కుమారుడు అగస్త్యను ఎత్తుకొని మురిసిపోయారు.
జ్ఞాపకంగా మిగలాలని..
హార్ధిక్ – నటాషాలు 2020 మే 31న ఒక కోర్టులో మ్యారేజ్ చేసుకున్నారు. అయితే.. అప్పుడు పరిస్థితులు బాగా లేవు. కరోనా నేపథ్యంలో సాదాసీదాగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. కానీ, ఆ రోజు నుంచి వాళ్ల మనసులో ఆత్మీయులు, బంధుమిత్రుల సమక్షంలో సాంప్రదాయంగా, వైభవంగా వివాహం చేసుకోవాలని ఉంది. జీవితంలో మర్చిపోలేని పెళ్లి రోజును జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని అనుకున్నారు. అందుకని హార్దిక్ – నటాషా జోడీ వచ్చే ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
సెర్బియా నుంచి బాలీవుడ్‌కు
నటాషా సొంత దేశం సెర్బియా. ఆమె 2012లో ఇండియాకు వచ్చింది. బాలీవుడ్లో మోడల్, డ్యాన్సర్, నటిగా రాణించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమెకు వెండితెర మీద నటించే అవకాశం వచ్చింది. అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్గన్, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోలతోనూ నటాషా నటించింది. ముంబై నైట్ క్లబ్లో హార్దిక్ పాండ్యా, నటాషా కలిశారు. నటాషాను చూడగానే హార్ధిక్ ప్రేమలో పడిపోయాడట. ఆ తర్వాత నటాషా కూడా ఈ ఆల్‌రౌండర్‌పై మనసు పడింది.2020 జనవరి 1న హార్దిక్, నటాషాకు ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ఈ జంట 2020లో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లితో ఒక్కటైంది.
We celebrated Valentine’s Day on this island of love by renewing the vows we took three years ago. We are truly blessed to have our family and friends with us to celebrate our love ❤️ pic.twitter.com/tJAGGqnoN1
— hardik pandya (@hardikpandya7) February 14, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

