ముచ్చటగా మూడోసారి.. హిందూ సంప్రదాయంలో హార్దిక్-నటాషాల వివాహం.. పిక్స్ వైరల్..!
టీమిండియా స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇందుకు కారణం తన భార్య నటాషా స్టాంకోవిక్‌ను మళ్లీ పెళ్లి చేసుకోవడమే. ఉదయ్‌పూర్‌లో గురువారం రాత్రి హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల నడుమ వీరి వివాహం ఘనంగా జరిగింది.
Hardik Pandya | టీమిండియా స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇందుకు కారణం తన భార్య నటాషా స్టాంకోవిక్ (Natasa Stankovic)ను మళ్లీ పెళ్లి చేసుకోవడమే. మూడేళ్ల క్రితమే పాండ్యా- నటాషా వివాహం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి పరిస్థితులను బట్టి ఈ జంట సాదాసీదాగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. అనంతరం వీరికి ఓ కుమారుడు అగస్త్య జన్మించాడు. అయితే, వాలెంటైన్స్ డే సందర్భంగా 2023 ఫిబ్రవరి 14న ఈ జంట క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో మరోసారి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.
అనంతరం ఉదయ్‌పూర్‌లో గురువారం రాత్రి మళ్లీ హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల నడుమ వీరి వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో నటాషాను హార్దిక్ మనువాడాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/hardikpandya7/status/1626253747801423872?s=20
హార్దిక్ – నటాషాలు 2020 మే 31న ఒక కోర్టులో మ్యారేజ్ చేసుకున్నారు. అప్పుడు కరోనా కారణంగా సాదాసీదాగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. 2020 జులై నెలలోనే వీరికి అగస్త్య అనే కుమారుడు జన్మించాడు. కానీ, ఆ రోజు నుంచి వాళ్ల మనసులో ఆత్మీయులు, బంధుమిత్రుల సమక్షంలో సాంప్రదాయంగా, వైభవంగా వివాహం చేసుకోవాలని ఉంది. జీవితంలో మర్చిపోలేని పెళ్లి రోజును జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ప్రేమికుల రోజును పురస్కరించుకొని ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా మళ్లీ పెళ్లి చేసుకున్నారు.
నటాషా సొంత దేశం సెర్బియా. ఆమె 2012లో ఇండియాకు వచ్చింది. బాలీవుడ్లో మోడల్, డ్యాన్సర్, నటిగా రాణించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమెకు వెండితెర మీద నటించే అవకాశం వచ్చింది. అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్గన్, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోలతోనూ నటాషా నటించింది. ముంబై నైట్ క్లబ్లో హార్దిక్ పాండ్యా, నటాషా కలిశారు. నటాషాను చూడగానే హార్దిక్ ప్రేమలో పడిపోయాడట. ఆ తర్వాత నటాషా కూడా ఈ ఆల్‌రౌండర్‌పై మనసు పారేసుకుంది. 2020 జనవరి 1న హార్దిక్, నటాషాకు ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ఈ జంట 2020లో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లితో ఒక్కటైంది.
https://twitter.com/hardikpandya7/status/1625523143380197377?s=20
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

