Harbhajan Singh: ఇంజామామ్ను డాక్టర్‌కు చూపించండి.. పాక్ మాజీ క్రికెటర్‌పై హర్భజన్ ఆగ్రహం
Harbhajan Singh: ఇంజమాముల్ హక్‌పై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్భజన్ తన మతాన్ని మార్చుకునే ప్రయత్నం చేసినట్లు ఇంజీ ఆరోపించాడు. ఆ కామెంట్‌పై భజ్జీ రియాక్ట్ అయ్యాడు. ఇంజీని డాక్టర్‌కు చూపించాలన్నాడు. అతని మానసిక స్థితి బాగాలేదన్నాడు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్‌పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్భజన్ సింగ్ ఇస్లాం మతాన్ని స్వీకరించేందుకు ఓ దశలో సిద్దమైనట్లు ఇంజామ్ ఆరోపించారు. ఓ టీవీ షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సిరీస్ సమయంలో మౌలానా తారిక్ జమీల్‌తో భజ్జీ మాట్లాడినట్లు ఇంజమామ్ గుర్తు చేశాడు. హర్భజన్ తన మతాన్ని మార్చుకునే ప్రయత్నం చేసినట్లు ఇంజీ ఆరోపించాడు.
పాక్ మాజీ కెప్టెన్ చేసిన ఆరోపణలను హర్భజన్ ఖండించాడు. ఇంజమామ్‌ను ఎవరైనా ఆస్పత్రికి తీసుకువెళ్లాలని, ఎందుకంటే ఆయన మానసిక స్థితి బాగాలేదని భజ్జీ పేర్కొన్నాడు. ఇంజీ చాలా వికృత వ్యాఖ్యలు చేశాడని, తాను సిక్కు మతస్థుడినని, సిక్కు కుటుంబంలో పుట్టినందుకు సంతోషంగా ఉందని భజ్జీ తెలిపారు. మీడియాతో ముందు హక్ ఎలా ఆ వ్యాఖ్యలు చేశాడని హర్భజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తాగిన మైకంలో అతను ఉన్నాడేమో అన్న అనుమానాలు వ్యక్తం చేశాడు.
ఇటీవల పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన వల్ల ఇంజమామ్ ఆ జట్టు చీఫ్ సెలెక్టర్ పోస్టు నుంచి తప్పుకున్నారు. కమిటీ వేసి జట్టు పర్ఫార్మెన్స్ గురించి దర్యాప్తు చేపట్టాలని కోరాడు. ఒకవేళ తన తప్పులేకుంటనే మళ్లీ చీఫ్ సెలెక్టర్ బాధ్యతల్ని చేపట్టనున్నట్లు ఇంజీ చెప్పాడు.
Yeh kon sa nasha pee kar baat kar raha hai ? I am a proud Indian and proud Sikh..yeh Bakwaas log kuch bi bakte hai 😡😡😡🤬🤬 https://t.co/eo6LN5SmWk
— Harbhajan Turbanator (@harbhajan_singh) November 14, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

