MI vs CSK : ఐపీఎల్లో స్టార్ ఆటగాళ్లే కాదు స్టార్ జట్లు కూడా ప్రేక్షకులను స్టేడియానికి రప్పిస్తాయి. ఆరంభ సీజన్ నుంచి అభిమానులను అంతకంతకు పెంచుకుంటున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మ్యాచ్ ఉందంటే చాలు స్టేడియాలు కిక్కిరిసిపోతాయి. జట్టుగా తమ ఛాంపియన్ ఆటతో, ఐదేసి టైటిళ్లతో ఐపీఎల్‌పై ముద్ర వేసిన ఈ రెండు జట్లు.. పట్టుదలకు, పోరాటపటిమకు ప్రతీకగా నిలిచాయి. అయితే.. పంతొమ్మిదో సీజన్లో తీవ్రంగా నిరాశపరుస్తూ.. ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన ముంబై, చెన్నై గురువారం వాంఖడేలో రెండు పాయింట్లపై కన్నేశాయి. రికార్డులు ముంబైకే అనుకూలంగా ఉన్నా సీఎస్కేను తక్కువ అంచనా వేసే సాహసం హార్దిక్ పాండ్యా సేన చేయకపోవచ్చు.
ఐపీఎల్ చరిత్రలో.. ఆరంభ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఉత్కంఠకు కేరాఫ్. ఏకపక్ష విజయాలు చాలా అరుదైనందున ఫలితం కోసం హోరాహోరీగా తలపడుతాయి రెండు జట్లు. అందుకే ఈ రెండు జట్ల మ్యాచ్‌ను గొప్ప పోరాటంగా అభివర్ణిస్తారు. 2013లో కీరన్ పొలార్డ్ పోరాడినా సీఏస్కేను ఓడించి తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది ముంబై. 2019 ఫైనల్లో ముంబై ఒక్క పరుగు తేడాతో చెన్నై నుంచి కప్పును లాగేసుకుంది.
10 trophies. 299 wins. One iconic MI–CSK rivalry ⚔️#RohitSharma vs #MSDhoni at Wankhede… who adds the next win tonight? 🏟️💙💛#TATAIPL 2026 👉 #MIvCSK | THU, 23 APR, 6:30 PM pic.twitter.com/z90GhNM7pl
— Star Sports (@StarSportsIndia) April 23, 2026
అలానే 2018లో ఆరంభ మ్యాచ్‌లో సీఎస్కే ఒక్క పరుగు తేడాతో గెలిచింది. టాపార్డర్ విఫలమైనా డ్వేన్ బ్రావో, కేదార్ జాదవ్‌లు ముంబై ఆశలపై నీళ్లు చల్లారు. ఇక 2022.. లీగ్ మ్యాచ్ ముంబైకి షాకిచ్చిన ధోనీ చెన్నైని విజేతగా నిలిపాడు. ఆఖరి ఓవర్లో 16 రన్స్ అవసరమవ్వగా.. ధోనీ వరసగా 6, 4, 2, 4తో మ్యాచ్‌ను ముగించాడు. కానీ, ఇప్పుడు ఈ రెండు జట్ల ఆట, తీరు మారింది.
A contest that has always had us on the 𝙚𝙙𝙜𝙚 𝙤𝙛 𝙤𝙪𝙧 𝙨𝙚𝙖𝙩𝙨 💺😬
Which among the many iconic #MIvCSK memories is your favourite? 🤩 #TATAIPL | #KhelBindaas | @mipaltan | @ChennaiIPL pic.twitter.com/wVzIraZHN0
— IndianPremierLeague (@IPL) April 23, 2026
ఒకప్పుడు రోహిత్ శర్మ ముంబైకి తరగని ఆస్తి అయితే.. సీఎస్కే విజయ పతాక ఎంఎస్ ధోనీ. హార్ధిక్ పాండ్యా సారథిగా మెప్పించలేకపోతున్నాడు. ఇటు ధోనీ వారసుడు రుతురాజ్ గైక్వాడ్ సైతం జట్టును గొప్పగా నడిపించలేకపోతున్నాడు. ప్రస్తుతం సంధి దశను ఎదుర్కొన్న చెన్నైకి.. నిలకడలేమితో సతమతమవుతున్న ముంబై భారీ షాక్ ఇవ్వాలనుకుంటోంది.
ఇప్పటివరకూ ముంబై, చెన్నై 41 సార్లు ఎదురుపడగా 22 విజయాలతో పైచేయి సాధించింది ముంబై. చివరిసారిగా నిరుడు ఏప్రిల్ 20న సీఎస్కేను ముంబై 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. పంతొమ్మిదో సీజన్లో మాత్రం పేలవ ప్రదర్శనతో వెనకబడిన ఈ దిగ్గజ జట్లలో ఈసారి గెలుపు ఎవరిది? అనేది ఆసక్తి రేపుతోంది. మొత్తంగా ఇరుజట్లు ఐపీఎల్లో 299 మ్యాచ్‌లు ఆడగా.. ముంబై 155 విజయాలు సాధించగా.. చెన్నై 144 మ్యాచుల్లో గెలిచింది.
A clash that 𝗯𝗿𝗶𝗻𝗴𝘀 𝗼𝘂𝘁 𝘁𝗵𝗲 𝗯𝗲𝘀𝘁 in both teams ⚔️👊@mipaltan or @ChennaiIPL – Which team is the 𝗪 loading for tonight? 🤔#TATAIPL | #KhelBindaas | #MIvCSK pic.twitter.com/jIbVEeHKGT
— IndianPremierLeague (@IPL) April 23, 2026