Test Debut | లార్డ్స్‌లో 30 ఏళ్ల క్రితం.. ఇంగ్లండ్ బౌలర్లను ఉతికేసిన దాదా, ద్రవిడ్..!
Test Debut : భారత పురుషుల క్రికెట్ జట్టు గొప్ప కెప్టెన్లలో ఒకడైన సౌరవ్ గంగూలీ(Sourav Ganguly), 'ది వాల్'గా పేరొందిన రాహుల్ ద్రవిడ్(Rahul Dravid)లు టెస్టుల్లో అరంగేట్రం చేసి ముప్ఫయేళ్లు అవుతోంది.
Test Debut : భారత పురుషుల క్రికెట్ జట్టు గొప్ప కెప్టెన్లలో ఒకడైన సౌరవ్ గంగూలీ(Sourav Ganguly), ‘ది వాల్’గా పేరొందిన రాహుల్ ద్రవిడ్(Rahul Dravid)లు టెస్టుల్లో అరంగేట్రం చేసి ముప్ఫయేళ్లు అవుతోంది. సరిగ్గా ఇదే రోజు జూన్ 20న 30 ఏళ్ల క్రితం ఇరువురు లార్డ్స్ మైదానంలో తొలి టెస్టు ఆడారు. సుదీర్ఘ ఫార్మాట్లో తమ స్థానాన్ని పదిలం చేసుకున్న ఈ ఇద్దరూ.. ఇంగ్లండ్ బౌలర్లను వణికించారు.
టీమిండియా దిగ్గజ ఆటగాళ్లైన సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ ఒకేసారి టెస్టుల్లో అరంగేట్రం చేశారు. 1996 ఇంగ్లండ్ పర్యటనలో జూన్ 20వ తేదీన లార్డ్స్ టెస్టుతో దాదా, ద్రవిడ్ టెస్టు కెరీర్ మొదలైంది. ఆడుతున్నది తొలి మ్యాచే అయినా బెరుకన్నదే లేకుండా స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించారిద్దరూ. దాదా తన స్టయిల్లో సిక్సర్లతో అలరించి శతకంతో కదం తొక్కగా.. ద్రవిడ్ హాఫ్ సెంచరీతో తమ ఆగమనాన్ని ఘనంగా చాటారు.
⚡️DREAM DEBUT⚡️#OnThisDay 30 years ago, two fine Indian batters made their Test debut at Lord’s.
Sourav Ganguly – 131
Rahul Dravid – 95 pic.twitter.com/R3K8lNZ15n— Cricbuzz (@cricbuzz) June 20, 2026
ఓపికగా ఆడిన దాదా 301 బంతులు ఎదుర్కొన్న శతకం అందుకోవడమే కాదు లార్డ్స్ హానర్స్ బోర్డులో చోటు సాధించాడు. అరంగేట్రం టెస్టులోనే అత్యధిక స్కోర్ కొట్టిన ఆటగాడిగా గంగూలీ రికార్డు నెలకొల్పాడు. ఇక ఏడో స్థానంలో వచ్చిన ద్రవిడ్ జిడ్డు ఆటతో 267 బంతులు ఎదుర్కొని 95 రన్స్ కొట్టాడు. వీరిద్దరు రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో అజారుద్దీన్ సారథ్యంలోని భారత్ 429 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 344 పరుగులు చేసినా.. మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

