పఠాన్ సిక్సర్
గతంలో భారత్‌కు క్రీడల్లో ప్రాతినిథ్యం వహించి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన క్రీడాకారుల్లో పలువురు సత్తాచాటారు. భారత మాజీ ఆల్‌రౌండర్, ‘సిక్సర్ల వీరుడి’గా గుర్తింపు పొందిన యూసుఫ్ పఠాన్.. తొలి ప్రయత్నంలోనే భారీ సిక్సర్ కొట్టాడు.
- అధీర్ రంజన్ చౌదరిపై ఘనవిజయం
- కృతి ఆజాద్, ప్రసూన్ బెనర్జీ జయకేతనం
న్యూఢిల్లీ: గతంలో భారత్‌కు క్రీడల్లో ప్రాతినిథ్యం వహించి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన క్రీడాకారుల్లో పలువురు సత్తాచాటారు. భారత మాజీ ఆల్‌రౌండర్, ‘సిక్సర్ల వీరుడి’గా గుర్తింపు పొందిన యూసుఫ్ పఠాన్.. తొలి ప్రయత్నంలోనే భారీ సిక్సర్ కొట్టాడు. పశ్చిమబెంగాల్లోని బరంపుర నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తరఫున బరిలో ఉన్న యూసుఫ్.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరిపై 85 వేల మెజారిటీతో జయకేతనం ఎగురవేశాడు. వరుసగా 5 సార్లు గెలిచిన అధీర్‌కు 25 ఏండ్ల తర్వాత ఓటమి రుచి చూపించాడు. టీఎంసీ నుంచే బరిలో ఉన్న మరో మాజీ క్రికెటర్, 1983 వన్డే వరల్డ్ కప్ జట్టులో సభ్యుడైన కృతి ఆజాద్.. (దుర్గాపూర్) వెస్ట్ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌పై లక్షా 37 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందాడు. అదే పార్టీకి చెందిన మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు ప్రసూన్ బెనర్జీ.. హౌరాలో ఘనవిజయం సాధించాడు. బీజేపీ తరఫున బరిలో నిలిచిన పారా అథ్లెట్ దేవేంద్ర ఝఝారియా (చురు), సుందర్‌గఢ్ (ఒడిశా)లో బిజూ జనతాదళ్ అభ్యర్థి అయిన హాకీ మాజీ సారథి దిలీప్ టిర్కీకి నిరాశే ఎదురైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

