‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’
సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోపై టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఫిఫా ప్రపంచకప్ నుంచి పోర్చుగల్ నిష్క్రమించడంతో.. సామాజిక మాధ్యమాల్లో రొనాల్డోపై భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టాడు.
- రొనాల్డోపై కోహ్లీ భావోద్వేగ పోస్టు
న్యూఢిల్లీ: సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోపై టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఫిఫా ప్రపంచకప్ నుంచి పోర్చుగల్ నిష్క్రమించడంతో.. సామాజిక మాధ్యమాల్లో రొనాల్డోపై భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టాడు. ‘ఈ ఆటలో నువ్వు సాధించిన ఘనతలు, అభిమానులకు అందించిన స్ఫూర్తికి ఏ ట్రోఫీ సాటిరానిది. విశ్వవ్యాప్తంగా అభిమానులపై నీ ప్రభావాన్ని మించింది లేదు. నీ ఆట చూసినపుడు కలిగే అనుభూతి ఏ టైటిలూ వర్ణించలేదు.
ఆట కోసం ప్రతి క్షణం ప్రాణం పెట్టడం.. కఠోర శ్రమ, అకింత భావానికి నిలువెత్తు నిదర్శనం నువ్వు. అందుకే నువ్వే నాకు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అని కోహ్లీ రాసుకొచ్చాడు. పోర్చుగల్ తరఫున 195 మ్యాచ్‌లాడిన రొనాల్డో 118 గోల్స్ చేశాడు. జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించినా.. ప్రపంచకప్ మాత్రం అతడికి కలగానే మిగిలింది. ప్రస్తుతం 37 ఏండ్ల రొనాల్డో మరో ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగుతాడా అనేది అనుమానమే!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిజాయితీ, పారదర్శకతతోనే సంస్థ అభివృద్ధి : హెచ్‌వోడీ జే. క్రిస్టోఫర్
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

