RR vs PBKS | దూబే, ఫెరీరా విధ్వంసం..పంజాబ్ జైత్రయాత్రకు బ్రేక్..!
RR vs PBKS : పంతొమ్మిదో సీజన్లో భారీ లక్ష్యాలను అలవోకగా ఛేదిస్తూ అజేయంగా దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్‌కు షాకిచ్చింది రాజస్థాన్ రాయల్స్. ఆరు విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్న పంజాబ్‌కు తొలి ఓటమి రుచి చూపించింది.
RR vs PBKS : పంతొమ్మిదో సీజన్లో భారీ లక్ష్యాలను అలవోకగా ఛేదిస్తూ అజేయంగా దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్‌కు షాకిచ్చింది రాజస్థాన్ రాయల్స్. ఆరు విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్న పంజాబ్‌కు తొలి ఓటమి రుచి చూపించింది. 223 లక్ష్య ఛేదనలో యశస్వీ జైస్వాల్(51), వైభవ్ సూర్యవంశీ(43)లు మెరుపు ఆరంభమివ్వగా.. డొనొవాన్ ఫెరీరా(52 నాటౌట్), ఇంప్యాక్ట్ సబ్ శుభం దూబే(31 నాటౌట్)లు డెత్ ఓవర్లలో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆరో విజయంతో మూడో స్థానానికి దూసుకెళ్లింది రాజస్థాన్.
ఐపీఎల్-19లో పంజాబ్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఎదురైన ప్రత్యర్థినల్లా ఓడిస్తున్న పంజాబ్‌కు సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్ ఊహించని పంచ్ ఇచ్చింది. ముల్లన్‌పూర్‌లో నిర్దేశించిన 223 పరుగుల ఛేదనను రాజస్థాన్ రాయల్స్ ధాటిగా మొదలెట్టింది. తొలి ఓవర్లోనే అర్ష్‌దీప్ సింగ్‌కు చుక్కలు చూపిస్తూ వైభవ్ సూర్యవంశీ(43) 6, 4, 4 బాదాడు. అనంతరం యాన్సెన్, ఫెర్గూసన్ ఓవర్లోనూ వైభవ్ విధ్వంసంతో 20 బంతుల్లోనే 51 పరుగులు చేసింది రాజస్థాన్.
On the charge! 💪
Shubham Dubey and Donovan Ferreira with a couple of massive hits to power #RR 🩷
Updates ▶️ https://t.co/fBbdVnExPZ#TATAIPL | #KhelBindaas | #PBKSvRR | @rajasthanroyals pic.twitter.com/002RZOJokX
— IndianPremierLeague (@IPL) April 28, 2026
అర్ధ శతకానికి చేరువైన వైభవ్ ఆ తర్వాతి బంతికే అయ్యర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ధ్రువ్ జురెల్()ను చాహల్ ఔట్ చేసి రెండో వికెట్ అందించాడు. కాసేపు షాట్లతో అలరించిన యశస్వీ జైస్వాల్()ను సైతం వెనక్కి పంపిన చాహల్.. కెప్టెన్ రియాన్ పరాగ్()ను పెవిలియన్ చేర్చాడు. చాహల్ వేసిన 14వ ఓవర్లో తొలి రెండు బంతుల్ని 6, 4 గా మలిచిన పరాగ్ చివరి బంతికి బౌటయ్యాడు.
దూబే, ఫెరీరా ధనాధన్
వెంట వెంటనే వికెట్లు పడినా ఇంప్యాక్ట్ సబ్‌గా వచ్చిన శుభమ్ దూబే(31 నాటౌట్) డొనొవాన్ ఫెరారా(52 నాటౌట్)లు అదరలేదు. గెలుపు బాధ్యత తీసుకున్న ఈ జోడీ పంజాబ్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. అర్ష్‌దీప్ వేసిన 18వ ఓవర్లో ఫెరీరా 6, 4.. చివరి బంతిని దూబే స్టాండ్స్‌లోకి పంపగా మ్యాచ్ రాజస్థాన్ వైపు మళ్లింది. 12 బంతుల్లో 18 రన్స్ అవసరమైన వేళ.. ఫెర్గూసన్ బౌలింగ్‌లో 4, 6 బాదిన ఫెరీరా పంజాబ్ ఓటమిని ఖాయం చేశాడు. యాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో స్ట్రెయిట్ సిక్సర్‌తో అర్ధ శతకం సాధించిన ఫెరీరా.. రాజస్థాన్‌కు 6 వికెట్ల విజయాన్ని కట్టబెట్టాడు.
The leading wicket-taker of #TATAIPL coming up clutch again 🪄
🎥 Yuzvendra Chahal with a couple of key strikes ☝️☝️
Updates ▶️ https://t.co/fBbdVnExPZ#KhelBindaas | #PBKSvRR | @PunjabKingsIPL pic.twitter.com/fGdndfheiK
— IndianPremierLeague (@IPL) April 28, 2026
ప్రభ్‌సిమ్రన్, స్టోయినిస్ మెరుపులు
పంజాబ్ కింగ్స్ ముల్లన్‌ఫూర్ భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(59) ఎప్పటిలానే శుభారంభమివ్వగా.. కూపర్ కొన్నొల్లీ(30), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(30)లు దంచేశారు. డెత్ ఓవర్లలో మార్కస్ స్టోయినిస్(62 నాటౌట్) సిక్సర్ల మోతతో పంజాబ్ స్కోర్ 200 దాటింది. బ్రిజేశ్ శర్మ వేసిన చివరి ఓవర్లో 4, 6 , 6 తో అర్ధ శతకం సాధించిన స్టోయినిస్ చివరి రెండు బంతుల్నీ బౌండరీ దాటించాడు. దాంతో, పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

