Glenn McGrath | అవేశ్, ప్రసిధ్లపై ఆసీస్ దిగ్గజ పేసర్ ప్రశంసలు.. గర్వంగా ఉందంటూ..
టీమిండియా యువ పేసర్లు అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణలపై ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ప్రశంసలు కురిపించాడు. ఆ ఇద్దరూ టీమిండియా తరఫున ఆడుతుండటం గర్వంగా ఉందన్నాడు. అవేశ్, ప్రసిధ్‌లతో పాటు తమ ఫౌండేషన్ (ఎంఆర్ఎఫ్)కు చెందిన మరికొంతమంది యువ భారత పేసర్లు ఐపీఎల్లో భాగమైనందుకు తాను సంతోషిస్తున్నానని మెక్‌గ్రాత్ అన్నాడు.
మెక్‌గ్రాత్ ప్రస్తుతం చెన్నైలోని ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌కు హెడ్‌గా వ్యవహరిస్తున్నాడు. అవేశ్, ప్రసిధ్లు గతంలో ఇక్కడ బౌలింగ్ పాఠాలు నేర్చుకున్నవారే. కాగా ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌కు తాను హెడ్‌గా నియమితుడై పదేండ్లు గడుస్తున్న తరుణంలో చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మెక్‌గ్రాత్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో మా ఫౌండేషన్‌కు చెందిన 29 మంది బౌలర్లను చూడటం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రసిధ్, అవేశ్లు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వారిని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది..’ అని వ్యాఖ్యానించాడు. ఈ సంస్థలో డెన్నిస్ లిల్లీ నెలకొల్పిన ఆశయాలను కొనసాగించడమే తన ముందున్న లక్ష్యమని మెక్‌గ్రాత్ తెలిపాడు.
ఇక ప్రస్తుతం క్రికెట్లో జోరుగా చర్చ నడుస్తున్న వన్డే ఫార్మాట్‌పై మెక్‌గ్రాత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనవరకైతే సంప్రదాయ టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టమని అన్నాడు. ‘నాకు టెస్టులన్నా, వన్డేలన్నా ఇష్టమే. కానీ నా దృష్టిలో టెస్టు క్రికెట్ అత్యుత్తమం. ఇది ఆటను కాపాడుతుందని నా ప్రగాఢ విశ్వాసం. వన్డేల భవిష్యత్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంది. అయితే టీ20, టెస్టులతో పాటు ఈ ఫార్మాట్‌నూ ప్రోత్సహించాల్సిన అవసరముంది..’ అని మెక్‌గ్రాత్ చెప్పాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

