క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
Eoin Morgan | ఇంగ్లండ్‌కు 2019లో క్రికెట్ ప్రపంచకప్ సాధించిపెట్టిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే 2022 జూలైలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆయన.. ఇతర లీగ్‌లలో ఆడుతున్నాడు.
లండన్: ఇంగ్లండ్‌కు 2019లో క్రికెట్ ప్రపంచకప్ సాధించిపెట్టిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే 2022 జూలైలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మోర్గాన్.. ఇతర లీగ్‌లలో ఆడుతున్నాడు. ఇప్పుడు పూర్తిగా క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు వెల్లడించాడు. మోర్గాన్ 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.
అయితే, ముందుగా 2006 నుంచి 2009 వరకు మోర్గాన్ ఐర్లాండ్ జట్టు తరఫున ఆడాడు. ఆ తర్వాత 2009 నుంచి ఇంగ్లండ్ జట్టుకు మారాడు. 2006లో స్కాట్లాండ్తో తొలి వన్డే, 2022 జూన్‌లో నెదర్లాండ్స్‌తో చివరి వన్డే ఆడాడు. అదేవిధంగా 2009లో నెదర్లాండ్స్‌తో తొలి టీ20, 2022 జనవరిలో వెస్టిండీస్‌తో చివరి టీ20లో పార్టిసిపేట్ చేశాడు. అయితే, బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు, పాకిస్థాన్‌తో చివరి టెస్టు ఆడిన మోర్గాన్ టెస్టు కెరీర్ కేవలం రెండేళ్లు మాత్రమే.
తన కెరీర్లో 16 టెస్టులు ఆడిన మోర్గాన్ 30.43 సగటుతో 700 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 130 అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. ఇక వన్డేల విషయానికి వస్తే మొత్తం 248 వన్డేల్లో 39.29 సగటుతో 7,701 పరుగులు రాబట్టాడు. అందులో 14 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 148. మొత్తం 115 టీ20లు ఆడిన మోర్గాన్ 28.58 సగటుతో 2,458 పరుగులు చేశాడు. 91 టాప్ స్కోర్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

