ENG vs NZ | పింక్ బాల్ టెస్టు.. న్యూజిలాండ్ వికెట్ కీపర్ అరుదైన ఘనత
టెస్టుల్లో న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ అరుదైన ఘనత సాధించాడు. పింక్ బాల్ టెస్టులో సెంచరీ కొట్టిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 306కు ఆలౌట్ అయింది.
ENG vs NZ : టెస్టుల్లో న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ అరుదైన ఘనత సాధించాడు. పింక్ బాల్ టెస్టులో సెంచరీ కొట్టిన తొలి వికెట్ కీపర్‌గా అతను రికార్డు క్రియేట్ చేశాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న మొదటి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్లండెల్ చెలరేగి ఆడాడు. 138 రన్స్ చేసి ఔటయ్యాడు. అతను శతకం బాదడంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 306 రన్స్ చేయగలిగింది.
రెండో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 79-2తో ఉంది. ఓపెనర్లు జాక్ క్రాలే (28), బెన్ డకెట్ (25) తక్కువ రన్స్‌కే ఔటయ్యారు. ఓలీ పోప్ (14), స్టువార్ట్ బ్రాడ్ (6)క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 98 రన్స్ ఆధిక్యంలో ఉంది.
గుర్తిండిపోయే ఇన్నింగ్స్
బే ఓవల్ స్టేడియంలో వేదిక అయిన ఈ టెస్టులో ఇంగ్లండ్ 325/9 వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కివీస్ బౌలర్ వాగ్నర్ నాలుగు వికెట్లు తీశాడు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్ కాన్వే ఫిఫ్టీతో శుభారంభం ఇచ్చాడు. విలియమ్సన్ (6), నికోలస్ (4), డారిల్ మిచెల్ (0) నిరాశ పరిచారు. కీలక వికెట్లు తీసి సంబురాల్లో ఉన్న ఇంగ్లండ్‌కు టామ్ బ్లండెల్ అడ్డు గోడలా నిలబడ్డాడు. పింక్ బాల్ టెస్టులో గుర్తిండిపోయే ఇన్నింగ్స్ ఆడిన అతను సెంచరీ సాధించాడు. 19 ఫోర్లు ఒక సిక్సర్‌తో 138 రన్స్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్ ఓలి రాబిన్సన్ 4 వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajkumar Periyasamy | అది సీక్వెల్ కాదు, అక్కడితోనే క్లోజ్.. ధనుష్ ‘ఓం’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
Culinary Medicine | ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతున్న క్యులినరీ మెడిసిన్.. అసలేమిటి.. ఏం చేస్తుంది..?
Electric Shock | దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం..భార్యభర్తలు మృతి
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

