IND vs SL : కొలంబో టెస్టులో శ్రీలంక బ్యాటర్లు గొప్పగా పోరాడుతున్నారు. ఐదో రోజు తొలి సెషన్లోనే లంకను పడగొట్టాలనుకున్న భారత బౌలర్ల ఆశలపై నీళ్లు చల్లుతూ క్రీజునంటుకుపోయాడు సొనాల్ దినుష(55 నాటౌట్). వరసగా నాలుగో హాఫ్ సెంచరీ బాదిన అతడు.. కేషర నువాంత(46 నాటౌట్)తో శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో.. లంచ్ సమయానికి లంక 116 పరుగుల ఆధిక్యంలో ఉంది.
వరసగా రెండో రోజు భారత బౌలర్లను సొమాల్ దినుష(55 నాటౌట్) విసిగిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో (103 రన్స్‌తో మెరిసిన దినుష.. ఐదో రోజు క్రీజులో పాతుకుపోయి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. టీమిండియా స్పిన్నర్లు, పేసర్లను దీటుగా ఎదుర్కొన్న దినుష కేషర నువాంత(46నాటౌట్)తో కలిసి ఏడో వికెట్‌కు శతక భాగస్వామ్యం నెలకల్పాడు.
Sri Lanka have gone past 300 following on, and their lead is nearing 100!
Will we have an exciting finish on day 5? https://t.co/SCLCTVytej pic.twitter.com/a51rwM9cn1
— Cricinfo (@cricinfo) August 27, 2026
చకచకా సింగిల్స్, డబుల్స్ తీస్తూ.. అప్పుడప్పుడు బౌండరీలతో శుభ్‌మన్ గిల్ సేన సహనాన్ని పరీక్షించిన ఈ ద్వయం లంక ఆధిక్యాన్ని వంద దాటించింది. కాసేపట్లో లంచ్ అనగా.. జడేజా ఓవర్లో నువాంత రివ్యూతో బతికిపోయాడు. దాంతో.. తొలి సెషన్లో వికెట్ ఇవ్వని లంక.. 329
/6 తో భోజన విరమానికి వెళ్లింది.