IPL 2024 DC vs RR : ఐపీఎల్ 17వ సీజన్ 9వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తలపడుతున్నాయి. జైపూర్‌లో జరుగుతున్నఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ తీసుకున్నాడు. రాజస్థాన్ ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఢిల్లీ రెండు మార్పులు చేసింది. ఇషాంత్ ఇంకా కోలుకోకపోవడంతో స్టార్ పేసర్ అన్రిచ్ నోకియా ఆడుతున్నాడు. షై హోప్ గాయపడడంతో ముకేశ్ కుమార్ జట్టులోకి వచ్చాడు.
ఢిల్లీ జట్టు : డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రికీ భుయి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమీత్ కుమార్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోకియా, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్.
రాజస్థాన్ జట్టు : యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్, హెట్‌మైర్, ధ్రువ్ జురెల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, చాహల్, సందీప్ శర్మ, అవేశ్ ఖాన్.
తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో కంగుతిన్న ఢిల్లీ బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయంతో టోర్నీని ఆరంభించిన రాజస్థాన్ మరో గెలుపు కోసం కాచుకొని ఉంది.