వెల్లింగ్టన్: బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో ఇరగదీస్తున్న విషయం తెలిసిందే. అతని బ్యాటింగ్ స్టయిల్ అందర్నీ స్టన్ చేస్తోంది. కివీస్‌తో జరిగిన రెండో టీ20లో సెంచరీతో చెలరేగాడతను. టీ20ల్లో అతనికి ఇది రెండవ సెంచరీ. పొట్టి ఫార్మాట్లో వెరైటీ షాట్లతో ఆకట్టుకుంటున్న సూర్య.. ఇక టెస్టుల్లోనూ ఎంట్రీ ఇవ్వనున్నాడు. భారీ హిట్టింగ్తో చెలరేగిపోతున్న సూర్యను టెస్ట్ అరంగేట్రం గురించి ప్రశ్నించారు. దానికి అతను బదులు ఇస్తూ.. ఆ రోజు కూడా వస్తుందని, ఆ సమయం కూడా వస్తుందని అన్నాడు. క్రికెట్ కెరీర్‌ను స్టార్ట్ చేసినప్పుడు రెడ్ బాల్‌తో స్టార్ట్ చేస్తామని, ముంబై జట్టు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడానని, ఆ ఫార్మాట్ గురించి కూడా తనకు బాగా తెలుసు అని, ఆ ఫార్మాట్ క్రికెట్‌ను కూడా ఎంజాయ్ చేస్తానని సూర్య తెలిపాడు.
టీ20ల్లో అదిరిపోయే స్ట్రయిక్ రేట్‌తో ఆడుతున్న సూర్య. .వన్డేల్లోనూ మెరుగ్గానే ఆడుతున్నాడు. ఇప్పటి వరకు సూర్య 41 టీ20 మ్యాచుల్లో 1395 రన్స్ చేశాడు. అతని యావరేజ్ 45.00గా ఉంది. ఇక ఇప్పటివరకు సూర్య 13 వన్డేలు ఆడాడు. దాంట్లో అతను 340 రన్స్ చేశాడు. వన్డేల్లో 34.00 బ్యాటింగ్ యావరేజ్ ఉంది.