మెల్బోర్న్: డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సౌతాఫ్రికాతో మెల్బోర్న్లో జరుగుతున్న రెండవ టెస్టు రెండవ రోజు ఆటలో వార్నర్ చెలరేగాడు. వార్నర్ 254 బంతుల్లో 16 ఫోర్లు, రెండు సిక్సర్లతో 200 పరుగులు చేశాడు. అయితే బ్యాటింగ్‌తో అలసిపోయిన వార్నర్.. డబుల్ సెంచరీ కాగానే రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. నడవటానికి కూడా అతను ఇబ్బంది పడ్డాడు. ఫిజియో సాయంతో అతను మైదానాన్ని వీడాడు. ఎంసీజీ మైదానంలో చప్పట్లు మారుమోగాయి.
A double century for David Warner!
But his #OhWhatAFeeling jump comes at a cost! 😬#AUSvSA | @Toyota_Aus pic.twitter.com/RqJLcQpWHa
— cricket.com.au (@cricketcomau) December 27, 2022
అద్బుతమైన రీతిలో వార్నర్ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేశాడు. వందో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన రెండవ బ్యాటర్‌గా వార్నర్ నిలిచాడు. గతంలో ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ ఈ రికార్డును సృష్టించాడు. తాజా సమాచారం మేరకు ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 351 రన్స్ చేసింది.
David Warner becomes only the second batter to score a double hundred in their 100th Test 🙌
Watch #AUSvSA LIVE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺#WTC23 | 📝 https://t.co/FKgWE9jUq4 pic.twitter.com/lXfn50rf5C
— ICC (@ICC) December 27, 2022