David Warner: చివరి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ.. టెస్టులకు వార్నర్ వీడ్కోలు
David Warner: వార్నర్ చివరి టెస్టు ఆడేశాడు. చివరి ఇన్నింగ్స్‌ను హాఫ్ సెంచరీతో ముగించాడు. సిడ్నీ టెస్టులో పాక్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో నెగ్గింది. వార్నర్‌కు ఆసీస్ క్రికెటర్లు, అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు.
సిడ్నీ: ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్(David Warner) తన చివరి టెస్టు ఆడేశాడు. వీడ్కోలు మ్యాచ్‌లో ఆసీస్‌కు విజయాన్ని అందించాడు. వార్నర్. పాకిస్థాన్‌తో సిడ్నీలో జరిగిన మూడవ టెస్టులో ఇవాళ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. చివరి ఇన్నింగ్స్‌లో వార్నర్ 57 రన్స్ చేసి నిష్క్రమించాడు. మరో వైపు మూడవ టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రెండవ ఇన్నింగ్స్‌లో 130 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి ఆ టార్గెట్‌ను చేజ్ చేసింది.
టెస్టు కెరీర్లో అత్యధిక పరుగులు చేసిన అయిదవ ఆస్ట్రేలియా బ్యాటర్‌గా వార్నర్ నిలిచాడు. సిడ్నీ టెస్టులో నాలుగవ రోజు వార్నర్ ఔటైన తర్వాత ప్లేయర్లు, ప్రేక్షకులు వీడ్కోలు పలికారు. తన హెల్మెట్‌ను, గ్లౌవ్స్‌ను ఓ చిన్నారి అభిమానికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. మైదానంలో ఉన్న తన కూతుళ్లకు హత్తుకున్నాడు. కన్నీళ్లను తుడుచుకుంటూ అభిమానులకు అభివాదం చేశాడు.
Happy retirement, David Warner 👏 pic.twitter.com/6yExEgUMSl
— ESPNcricinfo (@ESPNcricinfo) January 6, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

