సిడ్నీ : పరిమితికి మించి మద్యం సేవించి కారు నడిపిన కేసులో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్‌ను ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్న వార్నర్.. ఏడు రోజులు సెలవు దొరకడంతో స్వదేశానికి వెళ్లాడు.
మంగళవారం అతడు మద్యం తాగి కారును డ్రైవ్ చేస్తుండగా మరోబ్ర అనే ప్రాంతలో పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్టు చేయడంతో ఆ పరీక్షలో అతడికి పాజిటివ్ వచ్చింది. దీంతో వార్నర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత బెయిల్‌పై విడిచిపెట్టారు. త్వరలోనే పాక్‌కు రానున్న వార్నర్.. వచ్చే నెలలో కోర్టుకు హాజరవుతాడని సమాచారం.