David Warner | మద్యం మత్తులో డ్రైవింగ్.. ఆస్ట్రేలియా దిగ్గజం అరెస్ట్..!
David Warner : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) అరెస్టయ్యాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు సిద్ధమైన వార్నర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
David Warner : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) అరెస్టయ్యాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL)లో ఆడేందుకు సిద్ధమైన వార్నర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినందుకు డేవిడ్ భాయ్‌ను సిడ్నీలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం స్వదేశం వచ్చిన వార్నర్ ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోవడంతో పీఎస్ఎల్లో అతడు ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి.
అసలేం జరిగిందంటే.. సిడ్నీలోని మరౌబ్రాలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులను గమనించిన వార్నర్ టెస్టు తప్పించుకోవడం కోసం కొంత దూరంలో తన కారును పార్క్ చేశాడు. వార్నర్ కారు ఆపడం చూసిన పోలీసులు అతడి దగ్గరికే వెళ్లి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్ట్ చేశారు. ఇంకేముంది శ్వాస పరీక్షలో మనోడు గట్టిగానే ఆల్కహాల్ తీసుకున్నట్టు తేలింది.
Australian cricket great David Warner has been charged with drink driving in Sydney. Story: https://t.co/ROjGvZT5Up pic.twitter.com/SO7pgWSee4
— 7NEWS Adelaide (@7NewsAdelaide) April 7, 2026
చట్టప్రకారం ఉండాల్సిన దానికంటే రెండింతలు (0.104) ఎక్కువ ఆల్కహాల్ శాతం ఉందని, అందుకే వార్నర్‌ను అరెస్ట్ చేశామని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తమ నివేదికలో వెల్లడించారు. కోర్టు, విచారణ.. అంటూ కొన్ని రోజులు వార్నర్ స్వదేశంలోనే ఉండకతప్పదు. దాంతో.. పీఎస్ఎల్లో కరాచీ కింగ్స్(Karachi Kings) సారథిగా ఎంపికైన వార్నర్ జట్టుతో కలవడానికి మరింత సమయం పట్టేలా ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

