మియామి గార్డెన్స్ : రష్యా ఆటగాడు డేనియల్ మెద్వెదెవ్ మియామి ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో మెద్వెదెవ్ 7-5, 6-3తో ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్పై గెలుపొందాడు. ఈ విజయంతో మెద్వెదెవ్ ముఖాముఖి పోరులో 6-0 ఆధిక్యం సాధించాడు. ఈ యేడాది 25 మ్యాచ్లలో మెద్వెదెవ్కిది 24వ విజయం. చివరిసారిగా ఇండియన్ వెల్స్ టోర్నీ ఫైనల్లో అల్కారజ్ చేతిలో ఓడిపోయాడు. మెద్వెదెవ్ ఈ యేడాది పాల్గొన్న అయిదు టోర్నీలలో నాలుగు టైటిల్స్ దక్కించుకున్నాడు.