CWC 2023: కంగారూస్ ఈజ్ బ్యాక్.. ప్రత్యర్థులు కంగారు పడాల్సిందే..!
CWC 2023: భారత్, సౌతాఫ్రికాల చేతిలో ఓడిన కంగారూలు.. ఒకదశలో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానానికి వెళ్లారు. ఆ విజువల్స్ చూసి ‘అయ్యో.. ఎలాంటి జట్టు ఎలా అయిపాయే’ అని ఆవేదన చెందినవాళ్లూ లేకపోలేదు. కానీ అది ఆస్ట్రేలియా.
CWC 2023: వన్డే వరల్డ్ కప్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన జట్టు ఆస్ట్రేలియా. కానీ వరుసగా రెండు ఓటములతో ఆ జట్టుకు ఈసారి సెమీస్ అవకాశాలు కష్టమేనేమో అనుకుని పెదవివిరిచారు క్రికెట్ విశ్లేషకులు. భారత్, సౌతాఫ్రికాల చేతిలో ఓడిన కంగారూలు.. ఒకదశలో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానానికి వెళ్లారు. ఆ విజువల్స్ చూసి ‘అయ్యో.. ఎలాంటి జట్టు ఎలా అయిపాయే’ అని ఆవేదన చెందినవాళ్లూ లేకపోలేదు. కానీ అది ఆస్ట్రేలియా. పడ్డ చోటే పైకి లేవడం దానికి వెన్నతో పెట్టిన విద్య. ఒక్క ఛాన్స్ కోసం వేచి చూసిన కంగారూలు.. మరీ లేట్ చేయకుండా శ్రీలంకతో మ్యాచ్‌లోనే ఆ రిథమ్‌ను అందుకున్నారు. తమకు సొంతమైన దూకుడైన ఆటతీరుతో ఇప్పుడు హ్యాట్రిక్ విజయం సాధించి ఫుల్ స్వింగ్ లోకి వచ్చి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంపై కర్చీప్ వేసేశారు. ఇదే ఊపు కొనసాగితే టాప్ -2 లోకి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
కుదురుకున్నట్టేనా..?
భారత్, సౌతాఫ్రికా చేతిలో ఓటమి ఆసీస్‌కు గుణపాఠాలు నేర్పింది. ఈ రెండు మ్యాచ్‌లలో ఆ జట్టు బ్యాటింగ్ నాసిరకంగా ఉంది. టీమిండియాతో 199 పరుగులకే ఆలౌట్ అయిన ఆసీస్.. సఫారీలతో పోరులో 312 పరుగుల ఛేదనలో 177 పరుగులకే చాపచుట్టేసింది. ఆ రెండు మ్యాచ్‌లలో ఆ జట్టు బౌలింగ్ కూడా అంత గొప్పగా లేదు. కానీ శ్రీలంకతో మ్యాచ్ నుంచి కంగారూలు రూట్ మార్చారు. పసికూనలనే ట్యాగ్ లేకున్నా అదే స్థాయి ఆటతో కొట్టుమిట్టాడుతున్న లంకను 209 పరుగులకే కట్టడి చేసింది ఆసీస్. లక్నో వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో స్పిన్నర్ ఆడమ్ జంపా నాలుగు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్, కమిన్స్‌లు కూడా తలా రెండు వికెట్లు తీశారు. ఆసీస్ పేస్ త్రయం మిచెల్ స్టార్క్, కమిన్స్, హెజిల్వుడ్తో పాటు స్టోయినిస్, మార్ష్, మ్యాక్స్‌వెల్ లు ఆ జట్టు బౌలింగ్ బాధ్యతలు విజయవంతంగా మోస్తున్నారు. ఉపఖండపు పిచ్‌లపై జంపా బంతిని గింగిరాలు తిప్పుతున్నాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్ తర్వాత ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో జంపా (13) అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.
బ్యాటింగ్ లో దూకుడు..
ఇక బ్యాటింగ్‌లో కూడా ట్రావిస్ హెడ్ గైర్హాజరీలో ఓపెనర్‌గా ప్రమోట్ అయిన మిచెల్ మార్ష్ ఆదిలోనే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లు సెంచరీలతో కదం తొక్కడంతో కంగారూలు భారీ స్కోరు సాధించారు. లబూషేన్, స్టీవ్ స్మిత్ ఫామ్ ఆందోళనగా ఉన్నా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఈ ఇద్దరూ ఫామ్ అందుకున్నారు. మ్యాక్స్‌వెల్ కూడా శ్రీలంకతో పాటు నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లోనూ అదిరిపోయే ముగింపునిచ్చాడు. వార్నర్ గత రెండు మ్యాచ్‌లలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో విరుచుకుపడుతున్నాడు. మిడిలార్డర్లో లబూషేన్ కు తోడుగా వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ పరిస్థితులకు తగ్గట్టు బ్యాట్ ఝుళిపిస్తున్నాడు.
ముందుంది అసలు సవాల్..
అయితే ఆసీస్ హ్యాట్రిక్ విజయాలు సాధించినా అందులో పాకిస్తాన్ ఒక్కటే కాస్త పోటీనిచ్చే జట్టు. శ్రీలంక, నెదర్లాండ్స్‌లు ఆసీస్‌తో పోల్చితే ఎన్నో రెట్లు చిన్న జట్లు. ఈ మెగా టోర్నీలో ఆసీస్.. తమ తదుపరి మ్యాచ్‌లను న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లతో ఆడాల్సి ఉంది. చివర్లో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లతో మ్యాచ్‌లు ఉన్నా వీటిలో నెగ్గడం ఆసీస్‌కు సులువే కానీ కివీస్, ఇంగ్లాండ్‌లతో అంత వీజీ కాదు. మరి ఇదే ఊపును కంగారూలు కొనసాగిస్తారా..? అన్నది వేచి చూడాలి. ఏదేమైనా కంగారూలు పుంజుకోవడం ప్రత్యర్థి జట్లకు వరల్డ్ కప్ కు ముందు ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టేనని అభిమానులు వాపోతున్నారు. కలిసికట్టుగా దుమ్మురేపుతున్న ఆసీస్ ఒక్కసారి సెట్ అయితే ఆ జట్టును ఆపడం ఎవరితరమూ కాదు. మరి ఆస్ట్రేలియన్లు తమ ప్రత్యర్థుల ఆందోళనను నిజం చేస్తారా..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

