CoCommonwealth Games | భారత వెయిట్ లిఫ్టర్ అజయ్ సింగ్ సత్తా చాటాడు. కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించాడు. 24 ఏళ్ల అజయ్. 81 కేజీల విభాగంలో పోటీ పడ్డాడు. తాష్కెంట్ వేదికగా ఆదివారం జరిగిన పోటీల్లో అందరినీ ఓడించి అగ్రస్థానంలో నిలిచాడు. అతను మొత్తం 322 కేజీలు ఎత్తాడు. దీంతో 2022లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు నేరుగా అర్హత సాధించాడు.
ఇలా కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించిన భారతీయ వెయిట్ లిఫ్టర్లలో అజయ్ మూడవ క్రీడాకారుడు. అంతకుముందు శనివారం జరిగిన పోటీల్లో 147 కేజీలతో జాతీయ స్థాయి రికార్డు కూడా నెలకొల్పిన అజయ్.. స్వర్ణపతకం నెగ్గడంపై సంతోషం వ్యక్తం చేశాడు.