బార్సిలోనా : డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కారజ్ బార్సిలోనా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో శుభారంభం చేశాడు. అల్కారజ్ తొలి రౌండ్లో 6-3, 6-1తో నునొ బోర్గెస్‌పై సునాయాసంగా గెలుపొందాడు. అల్కారజ్ తనకు లభించిన ఏడు బ్రేక్ అవకాశాలలో ఐదింటిని సద్వినియోగం చేసుకున్నాడు. అల్కారజ్ తదుపరి రౌండ్లో స్పెయిన్‌కే చెందిన రాబర్టొ బటిస్టా అగట్‌తో తలపడతాడు.
అగట్ 6-4, 6-7(3-7), 6-4తో బెర్నబె జపాట మిరాల్లెస్పై విజయం సాధించాడు. ఇతర మ్యాచ్‌లలో అయిదో సీడ్ ఫ్రాన్సెస్ టియాఫొ 4-6, 7-6(7-3), 4-6తో ఎమిల్ రుసువోరి చేతిలోఓడిపోగా, కాస్పర్ రూడ్ 6-1, 7-6(7-1)తో బెన్ షెల్టన్‌పై, డీగొ స్వార్జ్‌మన్ 6-2, 6-2తో వు యిబింగ్పై, డేవిడ్ గాఫిన్ 7-6(7-3), 6-7(4-7), 6-0తో ఫెలిసియానొ లోపెజ్పై, ఫోకినా 6-3, 6-3తో ఎలచ్వెరిపై, ఆర్నాల్డి 6-3, 6-4తో మునార్‌పై గెలిచారు.