Brendon McCullum : ఇంగ్లండ్ ప్రధాన కోచ్ పదవికి బ్రెండన్ మెక్కల్లమ్(Brendon McCullum) రాజీనామా చేశాడు. ఇటీవల జట్టు చెత్త ప్రదర్శనతో విమర్శల పాలైన మెక్కల్లమ్ ఆదివారం తాను కోచ్‌గా వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ వైదొలగడంతో.. ‘ఇక నేను ఉండి ఏం లాభం’ అనుకున్నాడేమో తాను కూడా ఇంగ్లండ్, వేల్స్ బోర్డుకు టాటా చెప్పేశాడు.
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు మధ్యలోనే బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ అనంతరం తదుపరి హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ రాజీనామానే బాకీ అనుకున్నారంతా. అందరూ ఊహించినట్టే విమర్శకులకు మరింతగా తిట్టిపోసే అవకాశమివ్వకుండా మెక్కల్లమ్ వైదొలిగాడు.
BREAKING: Brendon McCullum has been sacked as England men’s Test head coach after four years in the role.
He will continue as head coach of England men’s white-ball teams pic.twitter.com/bsGTdXmGp2
— Cricinfo (@cricinfo) July 12, 2026
‘బజ్ బాల్’ ఆటతో టెస్టులకు కొత్త రూపునిచ్చిన మెక్‌కల్లమ్‌ను ఇటీవల యాషెస్ సిరీస్‌లో ఓటమి, స్వదేశంలో న్యూజిలాడ్ చేతిలో 1-2తో సిరీస్ కోల్పోవడం వంటివి బాధించాయి. విఫల కోచ్‌గా ఉండడం కంటే బాధ్యతల నుంచి తప్పుకోవడమే సరైందని అతడు భావించాడు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆదివారం తన నిర్ణయాన్ని ప్రకటించాడు బజ్.
న్యూజిలాండ్ ఓపెనర్‌గా మెక్కల్లమ్ ఎన్నో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) తరఫున ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లోనే శతకం బాదిన అతను 2022లో క్రిస్ సిల్వర్‌వుడ్ అనంతరం ఇంగ్లండ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ సమయానికి ఆ జట్టు టెస్టుల్లో వరుస ఓటములను చవిచూస్తోంది. అలాంటి జట్టును ఒక్క ఏడాదిలోనే మెక్కల్లమ్ మార్చేశాడు. తన స్టయిల్ విధ్వంసక ఆటను జట్టుకు ఒంటబట్టించాడు.
బెన్ స్టోక్స్, మెక్కల్లమ్

స్ట్రోక్ ప్లేతో అలరించే బెన్ స్టోక్స్ కెప్టెన్(Ben Stokes) అయ్యాక అతడి పని మరింత సులువైంది. మెక్‌కల్లమ్‌ను అభిమానులు ముద్దుగా ‘బాజ్’ అని పిలుస్తారు. దాంతో, అతను నేర్పిన ఆటకు ‘బాజ్‌బాల్'(Bazzball) అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. గత ఏడాది నుంచి ఇంగ్లండ్ టెస్టుల్లో అదరగొడుతోంది. పాకిస్థాన్ పర్యటనలో స్టోక్స్ సేన మూడు టెస్టులు నెగ్గి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత స్వదేశంలో ఐర్లాండ్(Ireland)తో జరిగిన ఏకైక టెస్టులోనూ సంచలన విజయం సాధించింది.