IPL 2024 SRH vs CSK : ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పేసర్ భువనేశ్వర్ కుమార్ బ్రేక్ ఇచ్చాడు. డేంజరస్ ఓపెనర్ రచిన్ రవీంద్ర(12)ను ఔట్ చేశాడు. రచిన్ భారీ షాట్ ఆడబోయి మర్క్రమ్ చేతికి చిక్కాడు.
దాంతో, 25 పరుగుల వద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. అజింక్యా రహానే క్రీజులోకి వచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్ 13 పరుగులతో ఆడుతున్నాడు. ఓవర్లకు స్కోర్.. 26/1.