Ben Stokes | ఇంగ్లీష్ జట్టుకు గుడ్ న్యూస్.. స్టార్ ఆల్ రౌండర్ వచ్చేస్తున్నాడు!
Ben Stokes | వన్డే ప్రపంచకప్‌లో ఇటీవలే అఫ్గానిస్తాన్ చేతిలో ఓడి తీవ్ర నిరాశలో ఉన్న ఇంగ్లాండ్‌కు శుభవార్త. అఫ్గానిస్తాన్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోని ఇంగ్లాండ్‌కు ఇది గుడ్ న్యూసే..
Ben Stokes | వన్డే ప్రపంచకప్‌లో ఇటీవలే అఫ్గానిస్తాన్ చేతిలో ఓడి తీవ్ర నిరాశలో ఉన్న ఇంగ్లాండ్‌కు శుభవార్త. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పూర్తి ఫిట్నెస్ సాధించాడని, తదుపరి మ్యాచ్‌లలో అతడు అందుబాటులో ఉండనున్నాడని సమాచారం. అఫ్గానిస్తాన్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోని ఇంగ్లాండ్‌కు ఇది కచ్చితంగా ఊరటనిచ్చే వార్తే.
వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా వరల్డ్ కప్ నేపథ్యంలో తిరిగొచ్చినా బెన్ స్టోక్స్ ఇంతవరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాలిగాయంతో ఇబ్బందిపడుతున్న స్టోక్స్.. గత మూడు మ్యాచ్‌లలోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ సారథి జోస్ బట్లర్ కూడా స్టోక్స్ ఎంట్రీపై కీలకమైన అప్డేట్ ఇచ్చాడు. స్టోక్స్ పూర్తి ఫిట్నెస్ సాధించాడని.. తదుపరి మ్యాచ్‌లో సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడని తెలిపాడు.
తాజా సమాచారం ప్రకారం.. స్టోక్స్ పూర్తిగా కోలుకున్నాడని, ఈనెల 21న ముంబై లోని వాంఖెడే వేదికగా సౌతాఫ్రికాతో జరగాల్సి ఉన్న మ్యాచ్‌లో ఆడతాడని తెలుస్తోంది. ఇదే విషయమై ఇంగ్లాండ్ వైట్ బాల్ టీమ్ హెడ్‌కోచ్ మాథ్యూ మాట్ స్పందించాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు తుదిజట్టు గురించి తాము చర్చిస్తామని.. ఫైనల్ లెవన్‌లో తీవ్ర పోటీ ఉన్న మాట వాస్తవమే అయినా దాని గురించి చర్చించాకే తుది నిర్ణయానికి వస్తామని తెలిపాడు. బెన్ స్టోక్స్ తమ జట్టులో స్ఫూర్తినింపగలడని, అతడితో మాట్లాడాక తదుపరి మ్యాచ్‌లో సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడని చెప్పాడు. స్టోక్స్ తుదిజట్టులోకి వస్తే యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌కు ఉద్వాసన తప్పేలా లేదు. అఫ్గానిస్తాన్ తో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్లందరూ విఫలమైన చోట బ్రూక్ మాత్రమే రాణించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

